కర్ణాటకలో ప్రేమ పేరుతో ఓ యువకుడు బలవంతంగా ఓ యువతి మెడలో తాళి కట్టాడు. అప్పటికే నిశ్చితార్థమైన ఆ యువతిని తాను ప్రేమిస్తున్నానంటూ తల్లిదండ్రుల ఎదుటే ఈ  పనికి ఒడిగట్టాడు.

కర్ణాటక లోని హాసన జిల్లా సకలేశపుర తాలూకాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 
కుశాలనగరకు చెందిన యువతికి ఓ యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఈనెల 25న వివాహం జరిపించాలని పెద్దలు నిర్ణయించారు. 

అయితే ఈనెల 24న సతీష్ అనే ఓ యువకుడు ఆ యువతి ఇంటిలోకి చొరబడ్డాడు. ఆ యువతిని తాను ప్రేమిస్తున్నానంటూ అక్కడే తాళి కట్టి ఆమెను వెంట తీసుకెళ్లాడు. షాక్ అయిన యువతి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో గాలింపు చేపట్టిన పోలీసులు సతీష్‌ను అరెస్ట్‌ చేశారు. యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు.