మెట్రో రైలులో ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఆఫీసు పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న యువతి ముందు ఓ యువకుడు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. తన ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ వికృత చర్యలకు పాల్పడ్డాడు. అతని వికృత చర్యను చూసి భయపడిపోయిన సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన  దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. విధులు ముగించుకుని మహిళా ఉద్యోగిని సాయంత్రం 6 గంటల సమయంలో గుర్గావ్‌ వెళ్లేందుకు ఢిల్లీ మెట్రో రైలు ఎక్కింది. ఆ సమయంలో అదే రైలులో ఉన్న ఓ యువకుడు తన ప్రయివేట్‌ పార్ట్స్‌ చూపిస్తూ యువతికి అసభ్యంగా సైగలు చేశాడు.

దీంతో యువతి అతని చేష్టలకు భయపడిపోయింది. సుమారు ఓ నిమిషం పాటు బ్యాగును అడ్డుపెట్టుకుంటూ, తీస్తూ సదరు వ్యక్తి మరింత వెకిలిగా ప్రవర్తించాడు. దీంతో చిర్రెత్తిపోయిన ఆ యువతి... స్నేహితురాలి సహాయంతో అతని ఫొటోను సంపాదించి.. తనకు జరిగిన ఘోర అనుభవాన్ని ట్విటర్‌లో రాసుకొచ్చింది.

Also Read ఒకే ఇంట్లో ఐదు మృతదేహాలు: సమీప బంధువే నిందితుడు...

యువతి ట్వీట్ పై స్పందించిన ఢిల్లీ మెట్రో యాజమాన్యం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే వెంటనే హెల్ప లైన్ నంబర్లకు కాల్ చేయాలని మెట్రో అధికారులు సూచించారు. తద్వారా దుండగులపై వెంటనే  చర్యలు తీసుకునే ఆస్కారం ఉందని పేర్కొంది. ఇక మెట్రో స్పందనతోపాటు , స్నేహితురాలి సహకారంతో  పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనిని గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.