ఓ యువకుడు వేరే కులం అమ్మాయిని ప్రేమించాడు. ఇంట్లో తెలియకుండా రహస్యంగా కలవడానికి ప్రయత్నించాడు. తెల్లారేసరికి విగతజీవిగా మారాడు. ఒంటిమీద తీవ్ర గాయాలు ఉండడంతో బంధువులు, కుటుంబ సభ్యులు అనుమానంతో పోలీసులను ఆశ్రయించారు. 

బెంగళూరు : karnatakaలో ఓ యువకుడు suspiciousగా మరణించాడు. క్రిష్ణగిరి సమీపంలో అర్థరాత్రి సమయంలో loverని కలిసేందుకు వెళ్లిన ఓ యువకుడు తీవ్ర గాయాలతో మృతి చెందాడు. సింగారపేట సమీపంలోని నాయకనూరుకు చెందిన మురుగన్ కొడుకు వెంకటేష్ (20) కూలీ పనులు చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన ఇతర వర్గానికి చెందిన ఓ అమ్మాయిని love చేశాడు. ఆదివారం అర్థరాత్రి సమయంలో కుటుంబసభ్యులకు తెలియకుండా ప్రేయసిని కలిసేందుకు వెళ్లాడు. 

అలా వెళ్లిన వెంకటేష్ సోమవారం ఉదయం తీవ్ర గాయాలతో శవమై కనిపించాడు. దీంతో అనుమానించిన వెంకటేష్ బంధువులు సింగారపేట-అత్తిపాడి మార్గంలో అతని మృతదేహంతో ఆందోళన నిర్వహించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్పీ సాయ్ చరణ్ తేజస్వి, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. దీనిమీద ప్రాధమిక విచారణ చేపట్టిన పోలీసులు అతను ప్రేయసిని కలవడానికి వెళ్లే క్రమంలో ఒక పొలానికి ఉన్న కంచెను దాటబోయి అందులో ఇర్కుకున్ని మరణించాడని పోలీసులు తెలిపారు. దీంతో ప్రమాదానికి కారణమైన కంచె వేసిన.. పొలం యజమానికి అరెస్ట్ చేశారు. 

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో దారుణ ఘటన జరిగింది. సభ్య సమాజం తలదించుకునేలా పట్టపగలు పదిమంది చూస్తుండగా.. ఓ మహిళపై Sexual assault జరిగింది. nellore జిల్లా మండల కేంద్రమైన సంగం సమీపంలోని ఓ గ్రామంలో శనివారం చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ married woman సమీపంలోని పొలాల్లో పశువులను మేపేందుకు వెళ్ళింది. మధ్యాహ్నం 3:00 గంటల సమయంలో అక్కడికి దగ్గర్లోని సారా బట్టీల దగ్గర సారా తాగిన ఓ యువకుడు మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాపాడాలని ఆమె కేకలు వేసింది. ఆ సమయంలో పలువురు పశువులు కాస్తూ అక్కడే ఉన్నారు. అయినా ఏ ఒక్కరూ ఆకృత్యాన్ని నిలువరించ లేదు. ఛోద్యం చూస్తూ నిలబడ్డారు.

ఈ విషయం తెలిసి ఎలాగో కామాంధుడి భార్యకు తెలిసింది. ఆమె పరుగు పరుగున వచ్చి అడ్డుకోవడంతో బాధితురాలు ప్రాణాలతో బయట పడింది. కొన్నేళ్లక్రితం పశువులను మేపేందుకు వెళ్లిన దివ్యాంగురాలు, ఆ తర్వాత మరో మహిళపై ఇలాగే దాడులు జరిగినా.. పోలీసు కేసులు నమోదు కాలేదు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అయినా విచారణ చేస్తామని ఎస్.ఐ నాగార్జున రెడ్డి చెప్పారు. 

కాగా, తెలంగాణలోని హైదరాబాద్ లో మార్చి 21న ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ కర్కశ తండ్రి కన్నకూతుర్లపైనే Sexual assaultకి ప్రయత్నించాడు. వనస్థలిపురం పరిధిలో ఆలస్యంగా ఆదివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… Nalgonda District దేవరకొండలోని ఓ తండాకు చెందిన వ్యక్తి భార్య, ఐదుగురు సంతానం. వారిలో 20, 13, పదకొండేళ్ల కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో అతడి కన్ను ఎదిగిన కుమార్తెలపై పడింది. నిత్యం liquor తాగి వచ్చి వారిని లైంగికంగా వేధించసాగాడు. అతడి ప్రయత్నాలను ఎప్పటికప్పుడు wife ప్రతిఘటించేది. శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చి మొదట తన 13 ఏళ్ల కుమార్తె లైంగిక దాడికి ప్రయత్నించాడు. మిగతా కుమార్తెలు అరవడంతో భయపడిన అతడు ఇంటి గేటుకు తాళం వేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్క చెల్లెలు అక్కడినుంచి తప్పించుకుని షీ టీమ్ కు, పోలీసులకు ఫోన్ చేశారు.