Asianet News TeluguAsianet News Telugu

టీనేజ్ లోనే సహజీవనం.. మూడేళ్ల తరువాత పోలీస్ ఉద్యోగం.. పెళ్లి చేసుకుందాం అనేసరికి ఫ్లేట్ ఫిరాయించి...

ఇద్దరికీ సాయంత్రం వేళ libraryలో పుస్తకాలు చదివే అలవాటు ఉంది. అలా లైబ్రరీలో రోజూ ఒకరినొకరు చూస్తూ పలకరించుకునేవారు. ఆ పలకరింపులు కాస్త ఇష్టంగా మారాయి. ఇద్దరూ కలిసి జీవించాలనుకున్నారు. ఇంకా studies పూర్తి కాలేదు కాబట్టి ఇంట్లో ఒప్పుకోరు అందుకని live-in-relation చేయాలని నిర్ణయించుకున్నారు. 

man denies girl friend to marry after live-in-relation in bihar
Author
Hyderabad, First Published Nov 17, 2021, 10:14 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బీహార్ : కాలేజీలో చదువుకునే సమయం నుంచి అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. తమ వయసు దానికి కరెక్టేనా అని కూడా ఆలోచించకుండా.. ఇంట్లో చెబితే ఒప్పుకోరని... ఆ తరువాత ఇద్దరూ సహజీవనం కూడా చేశారు. అయితే చదువు పూర్తి కాగానే ఆ ప్రేమికుడు అతన్ని నమ్మి జీవితాన్ని అర్పించిన ఆ యువతికి ట్విస్ట్ ఇచ్చాడు. 

ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారు. అప్పుడు ఆ woman తనని ప్రేమికుడు మోసం చేశాడని పోలీసులకు complaint చేసింది. ఈ సమస్యను ఆ పోలీసులు ఎలా పరిష్కరించారంటే...

bihar రాష్ట్ర రాజధాని పట్నాలో అంకుశ్ అనే కుర్రాడు 2019లో బీఏ చదువుకోవడానికి కాలేజీలో చేరాడు. ఆ సమయంలో దివ్య ( పేరు మార్చాం) బీ.కాం. చదువుకోవడానికి గ్రామం నుంచి వచ్చి పట్నాలోని కాలేజీలో చేరింది. ఇద్దరికీ సాయంత్రం వేళ libraryలో పుస్తకాలు చదివే అలవాటు ఉంది. అలా లైబ్రరీలో రోజూ ఒకరినొకరు చూస్తూ పలకరించుకునేవారు. 

ఆ పలకరింపులు కాస్త ఇష్టంగా మారాయి. ఇష్టం కాస్త ప్రేమగా మారింది. ప్రేమ గుడ్డిది అన్నది మరోసారి నిరూపించారు. వివేకాన్ని చంపేస్తుంది అనే విషయం మరోసారి రుజువయ్యింది. అంతే.. ప్రేమించుకున్నాం.. కాబట్టి పెళ్లికి టీనేజ్ లో తమ ఇంట్లో ఒప్పుకోరు కాబట్టి.. ఇద్దరూ కలిసి జీవించాలనుకున్నారు. ఇంకా studies పూర్తి కాలేదు కాబట్టి ఇంట్లో ఒప్పుకోరు అందుకని live-in-relation చేయాలని నిర్ణయించుకున్నారు. 

వారిద్దరూ భార్యభర్తలమని చెప్పి ఒక ఇంట్లో అద్దెకు దిగారు. ankush చదువుతోపాటు ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు కూడా రాసేవాడు. అలా వారిద్దరూ మూడేళ్లపాటు తమ చదువుని పూర్తి చేశారు. అదే సమయంలో అంకుశ్ బీహార్ police గా ఉద్యోగం సంపాదించాడు. దీంతో దివ్య సంతోషానికి హద్దులు లేకుండా పోాయయి. 

ఇక తామిద్దరం పెళ్లి చేసుకుని సుఖంగా జీవితం గడపవచ్చుననుకుని సంతోషపడింది. కానీ అంకుశ్ అప్పుడే పెళ్లి వద్దని చెప్పాడు. కానీ దివ్య పెళ్లిచేసుకోవడానికి ఇదే సరైన సమయంగా భావించింది. అంకుశ్ మాత్రం ఎంత చెప్పినా marriageకి అంగీకరించలేదు. పెళ్లి మాటెత్తగానే ఏదో ఒక వంక పెట్టి తప్పించుకునేవాడు. 

కొద్ది రోజుల్లో కూతురి పెళ్లి, అంతలోనే బ్లేడ్ తో కోసుకుని, ఉరికి వేలాడుతూ వధువు.. అసలేం జరిగిందంటే...

దీంతో దివ్య మహిళా పోలీస్ స్టేషన్ లో అంకుశ్ మీద ఫిర్యాదు చేసింది. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని చెప్పింది. పోలీసులు అంకుశ్ ని పిలిపించి విచారణ చేశారు. అతడికి కౌన్సిలింగ్ ఇప్పించారు. దివ్యతో పెళ్లికి తన ఇంట్లో ఒప్పుకోవడం లేదని. వారు ఒప్పుకుంటే తనకేం అభ్యంతరం లేదని అంకుశ్ పోలీసులతో అన్నాడు. ఆ తరువాత పోలీసులు అంకుశ్ ఇంటి వారికి కబురు పంపించారు. అంకుశ్ కి తండ్రి లేకపోవడంతో అతని తల్లి, అన్నతో జరిగింది చెప్పి..వారిని పెళ్లికి ఒప్పించారు. 

మరోవైపు దివ్య ఇంట్లో వాళ్లని కూడా పలిచారు. కానీ వారు ఈ పెళ్లికి తమ అంగీకారం తెలుపలేదు. అలా పోలీసులు అంకుశ్, దివ్య కేసుని ఒక కొలిక్కి తీసుకువచ్చారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios