ఇద్దరూ సహజీవనం చేయడం మొదలుపెట్టారు. అయితే.. చిన్నపాటి గొడవ  వారి జీవితాలను తలకిందులు చేసింది.

అతను ఓ మంచి సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి కొంత కాలం క్రితం ఓ హిజ్రా పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో.. ఇద్దరూ సహజీవనం చేయడం మొదలుపెట్టారు. అయితే.. చిన్నపాటి గొడవ వారి జీవితాలను తలకిందులు చేసింది. ఈ సంఘటన తమిళనాడు లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పుదుచ్చేరి రాష్ట్రం కార్తెక్కాల్ నెహ్రూ నగర్ హౌసింగ్ బోర్డుకు చెందిన ఫిలిప్‌కుమార్(38) ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు నీరావి నడుఓడుతురైకి చెందిన హిజ్రా శివాని(31)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ మేల్‌ఒడుతురై ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఆరు నెలలుగా కలసి ఉంటున్నారు. 

శనివారం వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో వారిద్దరు ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. చుట్టుపక్కల వారి సమాచారం మేరకు పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.