హోలీ సరదా ఓ వ్యక్తి ప్రాణాల్ని నిలువునా తీసింది. విచక్షణ మరిచి స్నేహితుడి భార్యకు రంగులు పూశాడో వ్యక్తి. కోపానికి వచ్చిన ఆ భర్త.. సదరు స్నేహితుడిని తుపాకీతో కాల్చి చంపాడు.

కోల్ కతా : రెండు రోజుల క్రితం దేశవ్యాప్తంగా holi celebrations ఘనంగా జరిగాయి. ప్రజలంతా రంగులు చల్లుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో కొన్నిచోట్ల ఘర్షణలు, అపశృతులు చోటుచేసుకున్నాయి. ఈ వేడుకల్లో knifeతో పొడుచుకుని ఓ వ్యక్తి మరణించగా.. West Bengalలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

కోల్కతాలో సుజిత్ మల్లిక్, దిలీప్ అనే వ్యక్తులు మంచి స్నేహితులు. ఉత్తరప్రదేశ్ కు చెందిన దిలీప్ చౌహాన్ (45) కొన్ని సంవత్సరాల క్రితం కలకత్తా చేరుకుని నాటూన్ పల్లిలోని తన బంధువులు నివాసం ఉంటున్న ఏరియాలోనే ఇల్లు అద్దెకి తీసుకుని వ్యాపారం చేస్తున్నాడు. సుజిత్ మల్లిక్ కూడా అక్కడే నివాసం ఉంటున్నాడు. కాగా, హోలీ రోజున వీధిలో వీరంతా కలిసి సంబరాలు జరుపుకున్నారు. వేడుకల్లో దిలీప్ అతని స్నేహితుడు.. సుజిత్ మల్లిక్ భార్యపై రంగులు చల్లారు.

అది గమనించిన సుజిత్ మల్లిక్… తన భార్యపై బలవంతంగా ఎందుకు రంగులు చెల్లవని దిలీప్ ను అడిగాడు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో తీవ్ర ఆవేశంతో సుజిత్ మల్లిక్, దిలీప్ ను తుపాకితో కాల్చిచంపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. దీంతో అక్కడున్నవారంతా ఒకసారిగా షాక్ కు గురయ్యారు. ఆతర్వాత నిందితుడు పారిపోయి డైమండ్ హార్బర్ ప్రాంతంలో ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి మాలిక్ ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా, హోలీ రోజు ఢిల్లీలోనూ ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని బాంగాంగ్ ఏరియాలో ఫుల్లుగా మద్యం తాగిన ఓ వ్యక్తి స్నేహితులతో కలిసి చిందులు వేశాడు. పెద్దగా సౌండ్ పెట్టుుకున స్టంట్స్ చేశాడు. ఆ క్రమంలో ఓ స్టంట్ చేయబోయి అనుకోకుండా చేతిలో కత్తితో చాతిలో పొడుచుకున్నాడు. అయితే నాలుగు సార్లు పొడుచుకున్నాక గానీ, తాను పొడుచుకున్నట్టు.. అతను రియలైజ్ కాకపోవడం విచిత్రం. రక్తం కారుతుంటూ గానీ విషయం బోధపడలేదు. అది గమనించిన బంధు మిత్రులు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు. అయితే, హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ అతడు మరణించినట్టు వైద్యులు తెలిపారు. 

మధ్యప్రదేశ్ లోని బాంగాంగ ఏరియాలో గోపాల్ సోలాంకి హోలి వేడుకల్లో భాగంగా రాత్రి పూట ఇంటి ముందు సౌండ్ బాక్సులు పెట్టుకుని మిత్రులతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఆ క్రమంలో ఎందుకో తెలియదు కానీ తన చేతిలోకి కత్తి తీసుకున్నాడు. కొంత సేపు మ్యూజిక్‌కు అనుగుణంగా మత్తులోనే తూలుగూ కనిపించాడు. పాటకు తగినట్టుగా ఓ స్టెప్ వేద్దామనుకున్నాడు. గుండెపై చేయి వేస్తూ స్టెప్ వేయాలనుకున్న గోపాల్ సోలాంకి.. కత్తి పట్టుకున్నాననే విషయాన్ని మరిచిపోయాడు. చేతిలో కత్తితోపాటుగా అలాగే.. గుండెపై నాలుగు సార్లు పొడుచుకున్నాడు. వెంటనే రక్తం బయటకు చిమ్మింది. రక్తంతో చేయి తడిచాక గానీ తాను చేసిన విషయం అర్థం కాలేదు. ఇంకేముంది.. వెంటనే అక్కడ్నుంచి తప్పుకున్నాడు. ఇది గమనించిన మిత్రులు వెంటనే పరుగున ఆయన వద్దకు చేరుకున్నారు. వెంటనే ఆయనను అరబిందో ఇన్‌స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. కానీ, గోపాల్ సోలాంకి బతకలేదు.