మమత కంచుకోట బెంగాల్ లో సైతం బిజెపి దాదాపు 50 శాతం సీట్లు గెలుచుకుని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఉన్న 42 సీట్లలో మమత కేవలం 22 సీట్లకే పరిమితం అయింది. 2014లో తనకు వచ్చిన 34 సీట్లలో కూడా 12 సీట్లని కోల్పోయింది. గత పర్యాయంలో తాము అత్యధిక స్థానాలు గెలిచిన ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, బీహార్ తదితర హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో ఎలాగు కొన్ని సీట్లన్నా కోల్పోవలసి వస్తుందని గ్రహించి ఈ నష్టాన్ని పూడ్చడానికి బెంగాల్, ఒడిశాపై కన్నేశారు. 

అక్కడ ఉన్న సర్కార్లు మమత, నవీన్ పట్నాయక్ లు వరుసగా ఎన్నికవ్వడం వల్ల ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతని తమకు అనుకూలంగా మలుచుకున్నారు. బెంగాల్ లో ఎప్పటినుంచో ఆలంబన కోసం ఎదురుచూస్తున్న మమత వ్యతిరేకులైన లెఫ్ట్ వర్కర్లకు బిజెపి ఆశ కల్పించింది. దీనితో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత, లెఫ్ట్ నేతల ద్వారా దొరికిన క్యాడర్ కు తోడు 27% ఉన్న ముస్లింల వల్ల బిజెపి హిందూతత్వ కార్డుని చాలా పక్కాగా ఉపయోగించింది. 

మొత్తానికి 42 ఎంపీ సీట్లు తానే గెలిచి అదృష్టం కలిసొస్తే పీఎం అవుదామని అనుకున్న దీదీకి బిజెపి గట్టి షాకే ఇచ్చింది.