మకర సంక్రాంతి సందర్భంగా పొన్నాంబలంమేడు పర్వత శిఖరాలపై మకర జ్యోతి భక్తులకు దర్శనమిచ్చింది. దీంతో భక్తులు పులకించిపోయారు. ఆపై శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం ‘‘స్వామియే శరణం అయ్యప్ప’’ నామస్మరణతో మారుమోగిపోయింది. 

శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం ‘‘స్వామియే శరణం అయ్యప్ప’’ నామస్మరణతో మారుమోగిపోయింది. మకర సంక్రాంతి సందర్భంగా పొన్నాంబలంమేడు పర్వత శిఖరాలపై మకర జ్యోతి భక్తులకు దర్శనమిచ్చింది. దీంతో భక్తులు పులకించిపోయారు. అంతకుముందు పందాళం నుంచి తీసుకొచ్చిన తిరువాభరణాలను అర్చకులు అయ్యప్ప స్వామికి అలంకరించారు. అనంతరం మూలమూర్తికి హారతి ఇచ్చారు. మకర జ్యోతి దర్శనం కోసం కేరళతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి అయ్యప్ప భక్తులు భారీగా శబరిమల చేరుకున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ALso REad: శబరిమల : అయ్యప్ప ప్రసాదం ‘‘అరవణం’’ విక్రయాలపై నిషేధం.. కారణమిదే

ఇదిలావుండగా.. శబరిమల అనగానే వెంటనే గుర్తొచ్చేది అయ్యప్ప ఆలయం, ఆ తర్వాత అరవణం ప్రసాదం. బియ్యం, బెల్లం, నేతితో తయారు చేసే ఈ ప్రసాదం రుచికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. శబరిమల వెళ్తున్న వారిని, వెళ్లి వచ్చిన వారిని ఖచ్చితంగా అరవణం ప్రసాదం అడుగుతారు. అలాంటి ఈ పవిత్ర ప్రసాదానికి సంబంధించి భక్తులకు షాకిచ్చింది కేరళ హైకోర్ట్. అరవణం ప్రసాద విక్రయాలు తక్షణం నిలిపివేయాలని ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డును న్యాయస్థానం ఆదేశించింది.

దీని తయారీకి ఉపయోగించే యాలకుల్లో రసాయన పదార్ధాలు వున్నాయని నిపుణులు ఇచ్చిన నివేదికలను పరిగణనలోనికి తీసుకున్న హైకోర్ట్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో రసాయన పదార్థాలతో వున్న యాలకులు లేకుండా ప్రసాదం తయారు చేసి, దానిని విక్రయించుకోవచ్చని కోర్ట్ సూచించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాలకు అనుగుణంగా వున్న పదార్ధాలతో తయారు చేసిన ప్రసాదాన్ని అమ్మకానికి అనుమతిస్తున్నట్లు ధర్మాసనం ఆదేశించింది.