ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నమయింది. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు షకార్పూర్ ఏరియాలో సోమవారం ఐదుగురు టెర్రరిస్టులను అరెస్ట్ చేశారు. అందుతున్న నివేదికల ప్రకారం అరెస్ట్ చేసిన ఉగ్రవాదులు ఏ గ్రూపుకు చెందినవారే ఇంకా తెలియరాలేదు.

ఈ ఐదుగురిలో ముగ్గురు జమ్మూ కాశ్మీర్ కు చెందినవారు కాగా, మిగతా ఇద్దరు పంజాబ్ కు చెందినవారు. స్పెషల్ సెల్ ఆఫీసర్లతో జరిగిన ఎదురు కాల్పుల అనంతరం ఉగ్రవాదులు అదుపులోకి తీసుకోబడ్డారు. వీరి వద్ద నుంచి ఆయుధాలు, ఇతర పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

20 రోజుల క్రితం దేశ రాజధానిలోని ఖాన్ మార్కెట్ ఏరియాలో ఢిల్లీ పోలీసులు టెర్రరిస్టుల రహస్య స్థావరాన్ని కనిపెట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇద్దరు జైషే ఈ మహ్మద్ టెర్రరిస్టులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రెండు సెమీ అటోమెటిక్ పిస్టల్స్, పది లైవ్ కాట్రిడ్జ్ లను స్వాధీనం చేసుకున్నారు. 

రాజధానిలో కలకలం రేపిన ఈ ఘటన తరువాత ఇప్పుడు తాజాగా ఐదుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది.