మహారాష్ట్ర లో ఘోర రోడ్డు ప్రమాదం : 10 మంది మృతి

maharasthra road accident
Highlights

ట్రక్కు, కారు ఢీకొనడంతో ప్రమాదం

మహారాష్ట్ర లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  యావత్మాల్ జిల్లా అర్ని సమీపంలో ఇవాళ ఉదయం ఓ కారు, ట్రక్కు ఢీ కొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పదిమంది మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. వారి పరిస్థితి కూడా విషమంగా సమాచారం.  ప్రస్తుతం క్షతగాత్రులు యావత్మాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

వాహనాలు ఎదురెదురుగా మితిమీరిన వేగంతో ఢీకొనడంతో రెండు వాహనాలు నుచ్చునయ్యాయి. ఈ వాహనాల్లో మృతదేహాలు చిక్కుకుని చిద్రమయ్యాయి.ఈ ప్రమాదం పై  సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి,  మృతదేహాలను బైటికి తీశారు.

ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఈ ప్రమాదం ఎలా జరిగింది, తప్పెవరిది అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  
 

loader