ముంబై:వివాహేతర సంబంధం నెపంతో మహిళను, ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తిని ట్రాక్టర్ తో తొక్కి చంపిన ఘటనలో మృతురాలి అత్తా మామలను శుక్రవారం నాడు అరెస్ట్ చేశారు.

జల్నా జిల్లాకు చెందిన మరియా అనే మహిళకు చపల్ గావ్ కు చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. పదేళ్ల క్రితమే ఆమె భర్త మరణించాడు.భర్త మరణించిన తర్వాత ఆమె అత్తింట్లోనే ఉంటుంది.

అయితే అదే గ్రామానికి చెందిన హర్బక్ భగవత్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది.ఈ పరిచయం వివాహేతర సంబంధం ఏర్పడింది.విషయం తెలిసిన వెంటనే మరియా అత్తింటి వారు భగవత్ ను బెదిరించారు.దీంతో భగవత్ ఆయన తండ్రి అంబద్ పోలీస్ స్టేషన్ లో మరియా అత్తింటివారిపై ఫిర్యాదు చేశాడు. తన ప్రాణాలకు ముప్పుందని పేర్కొన్నాడు.

ఈ ఏడాది మార్చి 30వ తేదీన మరియాతో పాటు భగవత్ గ్రామం నుండి పారిపోయారు. గుజరాత్ రాష్ట్రంలో తలదాచుకొన్నారు. మరియా అత్తింటి వాళ్లు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఏడాది ఏప్రిల్ 22న పోలీసులు గుజరాత్ నుండి మరియా, భగవత్ లను స్వగ్రామానికి తీసుకొచ్చారు. ఇదే గ్రామంలో వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు.ఈ నెల 28వ తేదీన మరియా, భగవత్ లు ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బైక్ పై వెళ్తుండగా  వికాస్ లాల్ జరేతో ట్రాక్టర్ తో వీరిని ఢీకొట్టి చంపాడని పోలీసులు చెప్పారు.

గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించారు. తన భర్త భగవత్ ను మరియాను... వికాస్ లాల్‌జరే తో పాటు అతని తండ్రి హత్య చేశారని  ఆమె ఆరోపించారు.వికాస్ తో పాటు అతని తండ్రిపై ఐపీసీ 302 సెక్షన్ ప్రకారంగా కేసు నమోదు చేసినట్టుగా నందేడ్కర్ సీఐ చెప్పారు.