రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

ముంబై: మహారాష్ట్రలో శుక్రవారం ఉదయం ఘోరమైన రోడ్డు
ప్రమాదం చోటు చేసుకొంది. యవత్కాల్ జిల్లా ఆర్నీ
సమీపంలోని కోస్‌దాని ఘాట్ వద్ద కారు, ట్రక్కు ఢీకొన్న
ఘటనలో పది మంది మృతి చెందారు.మరో ముగ్గురు
తీవ్రంగా గాయపడ్డారు.


మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు
ఉన్నారు.పంజాబ్‌ నుంచి ఓ సిక్కు కుటుంబం నాందేడ్‌కు
మూడు వాహనాల్లో వస్తుండగా అందులోని ఒక వాహనం
ప్రమాదానికి గురైంది. క్షతగాత్రులను యవత్మాల్‌ గ్రామీణ
ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి అధికారులు,
పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.