ఓ జంట.. ఒకరిని మరొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఇదే విధంగా తమ పెద్దవాళ్లకు తెలిపారు. పెళ్లి చేయమని కోరారు.  అయితే... వాళ్ల ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో.. పెద్దలను ఎదురించి వారు పెళ్లి చేసుకున్నారు.  తమ ఇష్టానికి  వ్యతిరేకంగాపెళ్లి చేసుకున్నారనే అక్కసుతో... ఆ ప్రేమ జంటను గదిలో పెట్టి నిప్పు అంటించారు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... అహ్మద్ నగర్ జిల్లా నిగోజ్ గ్రామానికి చెందిన చంద్రకాంత్.. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు.అతను రెండేళ్లుగా రుక్మిణి అనే యువతితో ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరివీ వేరు వేరు కులాలు కావడంతో... వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో... వీళ్లు... పెద్దలను ఎదురించి పెళ్లిచేసుకున్నారు.

ఈ విషయం రుక్మిణి తండ్రి జీర్ణించుకోలేకపోయాడు.  పథకం ప్రకారం... రుక్మిణి, చంద్రకాంత్ లను మారినట్లు నటించి పిలిపించారు. అనంతరం ఇద్దరినీ ఓ గదిలో బంధించి ఇంటికి నిప్పు పెట్టారు. 40శాతం గాయాలతో యువతి మృతి చెందగా... యువకుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. నిందితులు పరారీలో ఉన్నారు.