Bird Flu scare: కరోనా కోరల్లో నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న దేశ ప్రజలకు.. బర్డ్ ఫ్లూ రూపంలో మరో గండం ఎదురు అవుతుంది. దేశంలో చాపకింద నీరులా బర్డ్ ఫ్లూ విస్తరించి ఉన్నట్లు మహారాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. వేలాది కోళ్లు హఠాత్తుగా మృతి చెండటంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. కోళ్లను చంపాలని నిర్ణయించింది.
Bird Flu scare: ప్రపంచ మానవాళిని నిత్యం ఏదోక వైరస్ భయాందోళనకు గురి చేస్తుంది. దాదాపు రెండున్నరేండ్లు కరోనా కరాళ నృత్యం చేసింది. లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. ఇప్పుడిప్పుడే కాస్త శాంతించింది. కేసుల సంఖ్య కూడా దాదాపు తగ్గుముఖం పట్టింది. పరిస్థితి కాస్త ప్రశాంతంగా ఉన్న సమయంలో ఓ సారిగా ఆలజడి రేగింది. బర్డ్ ఫ్లూ రూపంలో మరో గండం ఎదురు అవుతుంది. చాపకింద నీరులా మహారాష్ట్రలో బర్డ్‌ఫ్లూ విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా.. విరార్‌లోని ఆర్నాలా, భండార్ అలీ, అగాషి, వాఘోలి ప్రాంతాల్లో మూడు రోజుల్లో 415కు పైగా కోళ్లు ఆకస్మికంగా మృతి చెందాయి. చనిపోయిన కోళ్ల శాంపిల్స్‌ను పూణే మెడికల్ కాలేజీకి పంపించారు. దీంతో ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా గా నిర్థారించబడింది. దీంతో అప్రమత్తమైన పాల్ఘర్ జిల్లా యంత్రాంగం ఆర్నాలా ప్రాంతంలో 1,200 కోళ్లను చంపి భూమిలో పాతిపెట్టాలని ఆదేశించింది. వసాయిలో బర్డ్ ఫ్లూ విజృంభించడంతో కోళ్ల వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. గత వారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోయాయి.
అలాగే.. పాల్ఘర్‌లోని పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూతో 800 కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో మృతి చెందిన కోళ్ల అవశేషాలను పరీక్షించిన వైద్యాధికారులు.. బర్డ్ ప్లూ(ఏవియన్ ఇన్ఫ్లుఎంజా) కారణంగా అవి మృతి చెందినట్లు నిర్ధారించారు.
గతంలో థానే జిల్లా షాపూర్ తాలూకాలో బర్డ్ ఫ్లూ వ్యాపించిన సంగతి తెలిసిందే. థానే జిల్లాలోని వెహ్లోలి గ్రామంలో ఉన్న ఓ పౌల్ట్రీ ఫారంలో 100కు పైగా కోళ్లు మృత్యువాత పడినట్లు గుర్తించిన స్థానిక అధికారులు, విషయాన్నీ జిల్లా పశువైద్యాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో పాల్ఘర్ జిల్లా యంత్రాంగం 25,000 కోళ్లను చంపాలని ఆదేశించింది.
మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం ప్రజలను, అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా మహారాష్ట్రలోని థానే జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయి. బర్డ్ ఫ్లూ కారణంగా షాహాపూర్‌లోని వెహ్లోలి గ్రామంలో ఉన్న ఓ పౌల్ట్రీ ఫామ్‌లో వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడ్డాయి. బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్ల వ్యాపారం నష్టాల్లో కూరుకుపోయింది. వ్యాధి సోకిన వారిలో గ్రామ కోళ్లు కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో పౌరులు భయాందోళనకు గురికావద్దని, పక్షులను జీవ సురక్షిత వాతావరణంలో ఉంచాలని, అలాగే కోళ్ల వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలని జిల్లా పశుసంవర్ధక శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. మాంసం విక్రయాలపై నిషేధాజ్ఞలు విధించారు. వైరస్ వ్యాప్తి ప్రస్తుతం అదుపులోనే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. ఇంతవరకు కోళ్ల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు.
