Asianet News TeluguAsianet News Telugu

ఈ మామిడి ధర వింటే దిమ్మతిరగాల్సిందే.. ఒక్కటి రూ. 1000లు మాత్రమే...

పండ్లలో రారాజుగా పిలిచే మామిడి.. ధర సరిగా పలకాలే కానీ మామిడి రైతును కూడా రారాజును చేస్తుంది. బంగినపల్లి, నీలం, తోతాపురి ఇలా అనేక రకాల్లో లభించే ఈ పండుకు సీజన్ లో ఉండే క్రేజే వేరు. అయితే, వీటన్నింటిలో కెల్ల మధ్యప్రదేశ్ లోని అలీరాజాపూర్ జిల్లాలో లభించే ‘నూర్జహాన్’ వెరైటీకి ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. పూత దశలో ఉండగానే అనేకమంది వీటిని బుక్ చేసుకుంటుంటారు. అంతటి క్రేజ్ దీని సొంతం.

Madhya Pradesh : Noorjahan mangoes each cost up to Rs 1,000 a piece - bsb
Author
Hyderabad, First Published Jun 7, 2021, 12:13 PM IST

పండ్లలో రారాజుగా పిలిచే మామిడి.. ధర సరిగా పలకాలే కానీ మామిడి రైతును కూడా రారాజును చేస్తుంది. బంగినపల్లి, నీలం, తోతాపురి ఇలా అనేక రకాల్లో లభించే ఈ పండుకు సీజన్ లో ఉండే క్రేజే వేరు. అయితే, వీటన్నింటిలో కెల్ల మధ్యప్రదేశ్ లోని అలీరాజాపూర్ జిల్లాలో లభించే ‘నూర్జహాన్’ వెరైటీకి ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. పూత దశలో ఉండగానే అనేకమంది వీటిని బుక్ చేసుకుంటుంటారు. అంతటి క్రేజ్ దీని సొంతం.

అయితే ఈసారి వాతావరణం అనుకూలించడంతో దిగుబడి బాగా వచ్చిందని నూర్జహాన్ పండించే రైతులు చెబుతున్నారు. ఒక్కో కాయ మూడు కిలోల వరకు తూగుతున్నట్లు తెలిపారు. గత ఏడాది ప్రతికూల పరిస్థితుల వల్ల ఒక్కో పండు బరువు 2.5 కిలోల వరకే పరిమితమైనట్లు రైతులు తెలిపారు. కాగా ఈ సారి మాత్రం మార్కెట్ లో నూర్జహాన్ పండుకు మంచి డిమాండ్ ఉన్నట్లు రైతులు తెలిపారు. 

ఒక్కో పండును రూ. 1000వరకు ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. 2019లో దీని ధర రూ.1,200 వరకు పలకడం గమనార్హం. జనవరి, ఫిబ్రవరిలో ఈ చెట్లు పూత పూస్తాయి. జూన్ ప్రారంభంలో పండ్లు చేతికొస్తాయి. ఈ మామిడి కాయలు ఒక్కొక్కటి అడుగు మేర పొడవు ఉంటాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios