Asianet News TeluguAsianet News Telugu

బ్యాడ్ లక్.. ప్రియురాలిని కలిసేందుకు వెళ్లి.. కూలర్‌లో చిక్కాడు.. వీడియో వైరల్..

ఓ వ్యక్తి తనప్రియురాలిని కలిసేందుకు రాత్రి వేళ ఎవరికి తెలియకుండా ఆమె ఇంటికి దూరాడు. కానీ, అతని బ్యాడ్ లక్..  ప్రియురాలు చేసిన పనికి అడ్డంగా బుక్కాయాడు. చివరికీ కుటుంబ సభ్యుల చేతిలో బలయ్యాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  

Lover Hides Inside Air Cooler To Meet Girl friend Her Family Catches Him In Rajasthan Video Goes Viral KRJ
Author
First Published Nov 5, 2023, 11:31 PM IST

రోజురోజుకు వివాహ బంధానికి విలువ లేకుండా పోతోంది. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకోవడం. పెళ్లి అయినా తరువాత ప్రియుడు లేదా ప్రియురాలితో వివాహేతర సంబంధం కొనసాగించడం కామన్ అయిపోయింది. అడ్డు చెప్పితే.. దారుణాలకు పాల్పడుతున్నారు. తమ వివాహబంధానికి తెగదెంపులు చేసుకుంటున్నారు. తమ పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు.

తాజాగా రాజస్థాన్‌లో ఓ వింత వెలుగు చూసింది. ఓ మహిళ తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని, రొమాన్స్ చేస్తుండగా.. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది.  దీంతో వారి రొమాన్స్ అడ్డుకట్ట పడింది. వారి కథ అడ్డం తిరిగింది. కుటుంబ సభ్యుల కన్నుగప్పుదామని తీవ్రంగా ప్రయత్నించింది. కానీ, ఆ ప్రియుడి టైం బాగోలేదనుకుంటా.. తన కుటుంబ సభ్యులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అనంతరం ఆ ప్రియుడికి కుటుంబ సభ్యులు అసలు సినిమా చూపించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాజస్థాన్ లో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. నిజానికి  ఓ ప్రేమికుడు తన ప్రియురాలిని కలిసేందుకు అర్థరాత్రి వేళ వెళ్లాడు. అందరూ నిద్రపోతారని ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ వెంటనే తన ప్రియురాలితో రొమాన్స్ లో మునిగిపోయాడు.  కానీ, వారు ఉన్న గది నుంచి ఏదో శబ్దం వినిపించడంతో ఇంట్లోకి దొంగ దూరాడనే అనుమానం కుటుంబ సభ్యులు వచ్చింది. ఇంటింటా దొంగ కోసం వెతకడం మొదలుపెట్టాడు.

దీంతో అప్రమత్తమైన ప్రియురాలు తన ప్రియుడ్ని తన గదిలో ఉన్న కూలర్‌లో దాచిపెట్టింది. ఏమి తెలియనట్టు కుటుంబ సభ్యులతో గదంతా వెతికింది. అయితే కూలర్‌ లోపల ఎవరో దాక్కుని ఉండటాన్ని వారు గమనించారు. దీంతో ఓ వ్యక్తి ఆ కూలర్‌ను తిప్పి చూశారు. వెంటనే అందరూ షాక్ అయ్యారు. అందులో ఉన్న వ్యక్తి బయటకు రప్పించారు. ఆ వ్యక్తి చూడగానే అందరూ షాక్ అయ్యారు. దొంగగా భావించిన వ్యక్తి అసలు ఆ మహిళ ప్రేమికుడేనని తెలుసుకున్నారు. ఈ వ్యవహారంపై మహిళను, ఆ వ్యక్తిని ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా మందలించారు.
  
ఇంటర్నెట్‌లో వీడియో వైరల్‌

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కుటుంబ సభ్యులు ఓ మహిళను తీవ్రంగా తిట్టడం చూడవచ్చు. ఈ వీడియోలో ఓ వ్యక్తి  కూలర్‌ని తిప్పినప్పుడు అందులో ఓ వ్యక్తి దాకున్నట్టు కనిపించింది. ఆ వ్యక్తిని చూడగానే కుటుంబసభ్యుల ఆగ్రహం తారా స్థాయికి చేరింది. దీంతో అక్కడి వాళ్లందరూ ఇద్దరినీ తిట్టడం ప్రారంభించారు. ఇలా చేయడానికి సిగ్గు లేదని ఆ మహిళను ప్రశ్నించగా.. తానేమీ తప్పు చేయడం లేదని సదరు మహిళ చెప్పడం చూడవచ్చు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ వైరల్ అవుతోంది. 

ఈ వీడియో క్లిప్‌ వైరల్‌ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఫన్నీగా కామెంట్లు చేస్తుండగా  మరీ కొందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళ కుటుంబానికి తన ప్రియుడి గురించి తెలిసిందా ?  లేదా కూలర్‌లో దాక్కున్న అతడ్ని అనుకోకుండా గుర్తించారా? అని ఒకరు సందేహం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తి కూలర్‌లో దాక్కున్న తీరు చూసి కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  రియల్లీ సో బ్యాడ్‌ లక్.. పాపం ప్రియుడు.. దురద్రుష్టం .. టైం బాగాలేదు.. అంటూ మరికొందరూ విచారం వ్యక్తం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios