పాట్నా: బీహార్  రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తూ నితీష్ కుమార్ ప్రభుత్వం మంగళవారం నాడు నిర్ణయం తీసుకొంది. అయితే లాక్‌డౌన్ ఎత్తివేసినా ఆంక్షలను కొనసాగించనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.సాయంత్రం ఏడు గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని బీహార్ సర్కార్ తెలిపింది. ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలు సాయంత్రం నాలుగు గంటల వరకు 50 శాతం సామర్ధ్యంతో పనిచేస్తాయని సీఎం తెలిపారు.

ఆన్‌లైన్ తరగతులకు ప్రభుత్వం అనుమతించింది. ప్రైవేట్ వాహనాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని తెలిపింది. రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలని  సీఎం ప్రజలను కోరారు. ఈ నెల 6వ తేదీన 920 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 7,13,117 కి చేరుకొన్నట్టుగా బీహార్ సర్కార్ తెలిపింది. తాజాగా 41 మంది కరోనాతో మరణించారు.దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 8,707కి చేరుకొంది. దేశంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే అన్‌లాక్ దిశగా వెళ్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం అన్ లాన్ ప్రక్రియను ప్రారంభించింది. బీహార్ రాష్ట్రం లాక్‌డౌన్ ను ఎత్తివేసింది. తెలంగాణ రాష్ట్రం కూడ లాక్‌డౌన్ పై ఇవాళ కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.