Lata Mangeshkar Death: లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికైనప్పుడూ.. ఎన్నడు ఏ విషయంలోనూ ఎంపీ అలవెన్సులు, చెక్కులను ఎప్పుడూ ముట్టుకోలేదు, ఒక్క సారి కూడా జీతం తీసుకోలేదు. ఇల్లు తీసుకోలేదు.
Lata Mangeshkar Death: భారత రత్న, నైటింటల్ ఆఫ్ ఇండియా, లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ (92) ఆదివారం తుది శ్వాస విడిచారు. గత నెల రోజులుగా కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందిన లతాజీ నేడు కన్నుమూశారు. లతాజీ మరణంతో సినీ ప్రపంచమే కాకుండా యావత్తు భారతం దిగ్భాంత్రి వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులే కాకుండా సామాన్య ప్రజానీకం కూడా లతాజీ మరణంపై సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
లతా మంగేష్కర్ గాయని గానే కాకుండా.. చిత్ర నిర్మాణ రంగంలోనూ రాణించారు. అలాగే.. ఆమె రాజ్యసభ సభ్యురాలిగా కూడా పనిచేశారు. లతాజీకి బీజేపీ మద్దతు ఇవ్వడంతో 1999 నుంచి 2005 వరకు ఎంపీగా పని చేశారు. అనారోగ్య కారణంగా.. ఆమె తన ఆరేండ్ల పదవీ కాలంలో కేవలం 12 సార్లు మాత్రమే పార్లమెంట్ కు హాజరయ్యారు. సభలో ఆమె కేవలం.. ఒక్కొక్క ప్రశ్నను అడిగారు. అది కూడా రైళ్ళు పట్టాలు తప్పడం గురించి ఆమె ప్రశ్నించారు. వివిధ సెక్షన్లలో రైళ్లు పట్టాలు తప్పుతున్న సంఘటనలు పెరుగుతుండటం నిజమేనా? 2000 సంవత్సరం ప్రారంభం నుంచి అలాంటి సంఘటనలు ఎన్ని జరిగాయి? పర్యవసానంగా రైల్వేలకు ఎంత నష్టం జరిగింది? ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? అని ఆమె అడిగారు.
ఆమె పార్లమెంటేరియన్‌గా ఉన్న కాలంలో.. ఎంపీగా తనకు అందిన అలవెన్సులు, చెక్కులను ఎప్పుడూ ముట్టుకోలేదని సమాచార హక్కు చట్టం ప్రకారం చేసిన దరఖాస్తుకు సమాధానం వచ్చింది. ఆమెకు చేసిన చెల్లింపులన్నీ పే అకౌంట్స్ కార్యాలయానికి తిరిగి వచ్చినట్లు వెల్లడైంది.
ఆమె అనారోగ్యం కారణంగా రాజ్యసభలో సమావేశాలకు హాజరు కాకపోవడంతో ఆనాడు ప్రతిపక్షంలో ఎంపీలుగా ఉన్న నేతలు ప్రణబ్ ముఖర్జీ, షబానా అజ్మీ, అప్పటి రాజ్యసభ ఉపాధ్యక్షులు నజ్మా హెప్తుల్లా వంటి వారు విమర్శించినా.. చాలా సున్నితంగా ఉంది. తిరిగి వారిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా హుందాగా నడుచుకున్నారు.
రాజ్యసభ సభ్యురాలుగా తన పదవీ కాలం సంతోషంగానే గడిచిందని పలు ఇంటర్యూల్లో తెలిపింది. రాజ్యసభ సభ్యురాలుగా తానను ఎన్నుకోవాడాన్ని తిరస్కరించానని, తనని వదిలేయండని పలు కోరారనీ చెప్పారు. కానీ, బీజేపీ నేతలు అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీలు మద్దతుతో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యానని, అయినప్పటికీ తాను ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా లేనని తెలిపారు.
సినీ పరిశ్రమ సమస్యలను పార్లమెంటులో ఎందుకు లేవనెత్తడం లేదని చాలా మంది విమర్శించారనీ, తాను గాయనిని మాత్రమేనని, వక్తను కానని చాలాసార్లు చెప్పానని అన్నారు. సమస్యలను లేవనెత్తే స్థాయిలో తనకు సినీ పరిశ్రమతో అనుబంధం లేదని చెప్పారు. 2005 కాశ్మీర్ భూకంపం సహాయం కోసం లతా మంగేష్కర్ భారీ డబ్బును విరాళంగా ఇచ్చారు.
