Asianet News TeluguAsianet News Telugu

కేంద్రం కీలక నిర్ణయం: వైద్య విద్యలో ఓబీసీలకు 27, ఈడబ్ల్యుఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్లు

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది.  2021-22 విద్యా సంవత్సరంలో  వైద్య విద్యలో చేరే విద్యార్థులకు రిజర్వేషన్లు అమలు చేస్తోంది.  ఓబీసీలకు 27 శాతం, ఆర్ధికంగా బలహీనవర్గాలకు 10 రిజర్వేషన్లను అమలు చేయనుంది.
 

Landmark decision in Medical Education:27% reservation for OBCs and 10% reservation for Economically Weaker Sections lns
Author
New Delhi, First Published Jul 29, 2021, 3:50 PM IST

న్యూఢిల్లీ: 2021-22 విద్యా సంవత్సరంలో  వైద్య విద్యలో  చేరే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.అండర్ గ్రాడ్యుయేట్స్, పీజీ విద్యార్థులతో పాటు ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, డిప్లమా, బీడీఎస్, ఎండీఎస్ చేరే విద్యార్థులకు  రిజర్వేషన్లను అమలు చేయనుంది.  ఓబీసీలకు 27 శాతం, ఆర్ధికంగా బలహీనవర్గాలకు 10 రిజర్వేషన్లను అమలు చేయనుంది.

 

ఈ నెల 26న జరిగిన సమావేశంలో ఈ విషయమై పెండింగ్ లో ఉన్న సమస్యకు పరిష్కారం సూచింాలని పీఎం అధికారులను ఆదేశించారు.కేంద్రం తీసుకొన్న నిర్ణయం కారణంగా 1500 మంది ఓబీసీ విద్యార్థులకు, పీజీలో 2500 మంది ఓబీసీలకు, ఎంబీబీఎస్ లో 550 మంది ఈడబ్ల్యుఎస్ విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. ఈడబ్ల్యుఎస్ విద్యార్థులకు పీజీలో వెయ్యి మందికి లబ్ది చేకూరనుంది.మెడికల్ సీట్ల భర్తీ కోసం  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 1986 లో ఆలిండియా కోటాను ప్రవేశపెట్టారు. ఒక రాష్ట్రానికి చెందిన విద్యార్థులు మరో రాష్ట్రంలోని ప్రముఖ కాలేజీలో విద్య అభ్యసించేందుకు  నివాస రహిత మెరిట్ ఆధారిత అవకాశాలను కల్పించింది. ఆలిండియాలో కోటాలో 15 శాతం సీట్లను  భర్తీ చేయనున్నారు.

2007 వరకు ఆలిండియా కోటా పథకంలో రిజర్వేషన్లు అమలులో లేవు. 2007లో సుప్రీంకోర్టు ఈ కోటాలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది.  ఓబీసీలకు 27 శాతం అమలు చేయాలని ఆదేశించింది.కేంద్ర ప్రభుత్వం బీసీలకు ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కట్టుబడి ఉందని ప్రకటించింది. ఓబీసీలకు ఆలిండియా కోటాలో 27 శాతం, ఆర్ధికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది.

ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల కోసం 2019లో రాజ్యాంగ సవరణ చేశారు. దీని ప్రకారంగా ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. ఈ నిర్ణయం 2014 నుండి వైద్య విద్యరంగంలో చేసిన ముఖ్యమైన సంస్కరణల్లో ఇది ముఖ్యమైంది.  గత ఆరేళ్లలో ఎంబీబీఎస్ సీట్లు 2014 నుండి 54,348 సీట్ల నుండి 56 శాతం పెరిగాయి.  2020లో ఈ సీట్లు 84,649 సీట్లకు పెరిగాయి. పీజీ సీట్లు 2014లో 54,275 సీట్లు 80 శాతం పెరిగాయి. అదే ఏడాదిలో 179 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు.దేశంలో 558 ప్రభుత్వ, 289 ప్రైవేట్ వైద్య కాలేజీలున్నాయి.


 

Follow Us:
Download App:
  • android
  • ios