లేడీ కిలాడీ.. డేటింగ్ యాప్‌లో కలిసిన వ్యక్తిని హోటల్ తీసుకెళ్లి లక్షల రూపాయలు వసూలుకు యత్నం.. ఏం జరిగిందంటే?

డేటింగ్ యాప్‌లో పరిచయమైన వ్యక్తిని హోటల్‌కు తీసుకెళ్లి డబ్బులు వసూలు చేయడానికి ఓ కిలాడీ లేడీ ప్రయత్నించింది. కానీ, బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో బయటపడ్డాడు. ఆ లేడీ మరొకరి సహాయంతో ఇలా 12 మందిని మోసం చేసినట్టు తెలిసింది. నాలుగు ఫేక్ రేప్ కేసులు పెట్టినట్టూ పోలీసులు గుర్తించారు.
 

lady tries to extort man in hotel whom she met at a dating app kms

గురుగ్రామ్: డేటింగ్ యాప్‌లో ఓ వ్యక్తిని పరిచయం చేసుకుని హోటల్‌కు తీసుకెళ్లింది. బీర్ తాగమని బలవంతం చేసింది. తాను ఊహించినదానికి పరిస్థితులు వేరుగా ఉండటంతో ఆయన హోటల్ వదిలి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆయనకు ఫోన్ చేసి తనతో అసభ్యంగా ప్రవర్తించావని, లైంగికంగా వేధించావని బెదిరించింది. రూ. 5 లక్షలు ఇవ్వాలని లేదంటే.. పోలీసు కేసు పెడతానని వార్నింగ్ ఇచ్చింది. ఈ ఘటన గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది.

బిహార్‌కు చెందిన 27 ఏళ్ల బినితా కుమారి గురుగ్రామ్‌లో ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నది. హర్యానా రోహతక్‌లోని భాలతో గ్రామానికి చెందిన 30 ఏళ్ల మహేశ్ ఫోగట్ ఓ ఎన్జీవోలో పని చేస్తున్నాడు. వీరిద్దరు కలిసి డేటింగ్ యాప్‌లో అమాయకులకు గాలం వేసి డబ్బులు వసూలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వీరిద్దరిపై డీఎల్ఎఫ్ ఫేజ్ 3 పోలీసు స్టేషన్‌లో కేసు ఫైల్ అయింది. ఇప్పటి వరకు ఈ జంట 12 మందిని మోసం చేసినట్టు తెలిసింది. అంతేకాదు, నాలుగు నకిలీ రేప్ కేసులు కూడా పెట్టినట్టు వెల్లడైంది. 

డేటింగ్ యాప్‌లో బంబుల్‌లో బినితా కుమారి ఓ వ్యక్తితో పరిచయం పెంచుకుంది. సెక్టార్ 23 ఏరియాలోని హోటల్‌కు తనతో రావాలని ఆఫర్ చేసింది. తీరా ఆ వ్యక్తి అక్కడికి వెళ్లాక బీర్ తాగాలని బలవంతం చేసింది. తనకు తేడా కొట్టడంతో హోటల్ వదిలి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆమె అతనికి ఫోన్ చేసి తనతో తప్పుగా బిహేవ్ చేశావని, లైంగిక వేధింపులూ చేశావని బెదిరించింది. పోలీసు ఫిర్యాదు చేస్తానని కూడా బెదిరించింది.

Also Read: Indira Gandhi: ఇందిరా గాంధీ హత్యను చిత్రీకరిస్తూ కెనడాలో శకటం.. కేంద్ర మంత్రి జైశంకర్ ఏమన్నారంటే?

అంతలోనే మహేష్ ఫోగట్ అతనికి ఫోన్ చేశాడు. ఈ సమస్యను ఇక్కడితోనే ముగించాలనుకుంటే రూ. 5 లక్షలు ఇస్తే సెటిల్‌మెంట్ అవుతుందని అన్నాడు. బాధితుడు రూ. 2 లక్షలకు అంగీకరించాడు. వారిద్దరికీ రూ. 50 వేలు ఇచ్చి భరోసా ఇచ్చాడు. మిగిలిన డబ్బులు త్వరలోనే ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించాడు. సిటీ పోలీసులు ట్రాప్ వేసి ఈ కిలాడీ లేడీని పట్టుకున్నారు.

మిగిలిన డబ్బులు తీసుకోవడానికి మౌల్సరి మార్కెట్ సమీపంలోని సాయి టెంపుల్‌కు రావాలని బాధితుడు ఆ ఇద్దరికీ కాల్ చేశాడు. డబ్బులు తీసుకుంటుండగా మహేష్ ఫోగట్‌ను పోలీసుల రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు ఏసీపీ కౌశిక్ చెపపారు. ఆ తర్వాత బినితా కుమారిని డీఎల్ఎఫ్ 3 యూ బ్లాక్ నుంచి అరెస్టు చేసి తీసుకెళ్లారు. 

బాధితుడు చెల్లించిన రూ. 50 వేలు, రెండు మొబైల్ ఫోన్లను వారి నుంచి పోలీసులు రికవరీ చేసుకున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios