Asianet News TeluguAsianet News Telugu

ఆర్మీ అధికారిణికి తప్పని వేధింపులు...సోషల్ మీడియా ద్వారా టెకీ వేధింపులు

దేశంలో చిన్నారులు, బాలికలపై వేధింపులు మితిమీరిపోతున్నాయి. ఇక సోషల్ మీడియా లో అయితే ఆ వేధింపులకు అడ్డే లేకుండా పోతోంది. నకిలీ ఐడీలు క్రియేట్ చేసుకుని కొందరు ఆకతాయీలు మహిళలనే టార్గెట్ గా చేసుకుని రెచ్చిపోతున్నారు. ఈ వేధింపులు ఎంతవరకు వచ్చాయంటే పోలీస్ అధికారుణులు, ఆర్మీ అధికారిణిలను కూడా ఈ సోషల్ మీడియా ఆకతాయిలు వదలడం లేదు. తాజాగా ఇండియన్ ఆర్మీకి చెందిన ఓ అధికారిణిపై ఓ సాప్ట్ వేర్ వేధింపులకు పాల్పడుతున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. 

LADY ARMY OFFICER CLAIMS SEXUAL HARASSMENT  CASE
Author
Pune, First Published Aug 11, 2018, 2:02 PM IST

దేశంలో చిన్నారులు, బాలికలపై వేధింపులు మితిమీరిపోతున్నాయి. ఇక సోషల్ మీడియా లో అయితే ఆ వేధింపులకు అడ్డే లేకుండా పోతోంది. నకిలీ ఐడీలు క్రియేట్ చేసుకుని కొందరు ఆకతాయీలు మహిళలనే టార్గెట్ గా చేసుకుని రెచ్చిపోతున్నారు. ఈ వేధింపులు ఎంతవరకు వచ్చాయంటే పోలీస్ అధికారుణులు, ఆర్మీ అధికారిణిలను కూడా ఈ సోషల్ మీడియా ఆకతాయిలు వదలడం లేదు. తాజాగా ఇండియన్ ఆర్మీకి చెందిన ఓ అధికారిణిపై ఓ సాప్ట్ వేర్ వేధింపులకు పాల్పడుతున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.  కేవలం వేధింపులే కాదు తన పేరుతో ఓ పేస్ బుక్ అకౌంట్, వెబ్ సైట్ ను నడుపుతున్నట్లు సదరు బాధిత అధికారిణి ఫిర్యాదులో పేర్కొంది.

డిల్లీకి చెందిన ఓ మహిళ ఇండియన్ ఆర్మీలో ఓ ఉన్నత స్థాయి ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తోంది. ఈమెకు సోషల్ మీడియాలో పూణేకు చెందిన ఓ టెకీ పరిచయమయ్యాడు. అయితే మొదట్లో బాగానే ఉండే ఇతడు రానురాను వేధించడం మొదలుపెట్టాడు. తనను పెళ్లి చేసుకోవాలంటే ఆమెను బలవంతపెట్టేవాడు. తనకు ఇష్టం లేదని చెప్పడంతో ఆమెపై కోపాన్ని పెంచుకున్నాడు. దీంతో ఆమె పేరుతో నకిలీ ఖాతాలు క్రియేట్ చేసి మరింత వేధించడం మొదలుపెట్టాడు.  

అయితే అతడి ప్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని హెచ్చరించి వదిలేయాలని ఆ అధికారిణి భావించింది. అతడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తనను పెళ్లి చేసుకోవాలని తెగేసి చెబుతుండటంతో ఇక తట్టుకోలేకపోయిన ఆమె ఈ వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios