Asianet News TeluguAsianet News Telugu

కరోనా టెస్ట్ పేరిట.. యువతి ప్రైవేట్ పార్ట్స్ నుంచి..

కరోనా ఫలితం సరిగా రావాలంటే... ప్రైవేట్ పార్ట్స్ నుంచి శాంపిల్ తీసుకోవాలంటూ యువతి పట్ల నీచంగా ప్రవర్తించాడు. 

Lab Technician Takes woman vaginal swab fr covid19 test in maharastra
Author
Hyderabad, First Published Jul 31, 2020, 5:23 PM IST

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ మన దేశంలో 16లక్షల మందికి సోకింది. కాగా.. వైరస్ లక్షణాలు అనిపించిన వెంటనే చాలా మంది పరీక్ష చేయించుకోవడానికి పరుగులు తీస్తున్నారు. అయితే.. ప్రజల్లో ఉన్న భయాన్ని చాలా మంది తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇప్పటికే కరోనా వార్డుల్లో చికిత్స పొందుతున్న చాలా మంది అమ్మాయిలు అత్యాచారానికి గురయ్యారు. తాజాగా.. కరోనా పరీక్ష చేయించుకోవడానికి వచ్చిన యువతి పై కూడా ఓ వ్యక్తి నీచంగా ప్రవర్తించాడు. కరోనా ఫలితం సరిగా రావాలంటే... ప్రైవేట్ పార్ట్స్ నుంచి శాంపిల్ తీసుకోవాలంటూ యువతి పట్ల నీచంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మహారాష్ట్రకు చెందిన ఓ యువతి ఓ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. కాగా.. సదరు యువతి కోలిగ్ కి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో.. భయపడిపోయిన యువతి తాను కూడా టెస్ట్ చేయించుకోవాలని అనుకుంది. వెంటనే సమీపంలోని కోవిడ్ ట్రామా సెంటర్ ల్యాబ్‌ కు వెళ్లింది. అక్కడున్న టెక్నీషియన్ కరోనా టెస్ట్ ఎలా చేస్తారో నీకు తెలుసా? అని ఆమెను అడిగాడు. నాకు తెలీదని ఆమె సమాధానం చెప్పింది. దీంతో టెస్ట్ రిజల్ట్ కరెక్ట్ గా రావాలంటే యోని నుంచి శాంపిల్ తీసుకోవాలని ఆ యువతిని నమ్మించాడు. అందుకు ఆమె ఒప్పుకుంది. దీంతో ఆమె యోని నుంచి శాంపిల్‌ను సేకరించి పైశాచికానందం పొందాడు. 

ఈ విషయాన్ని ఆమె తన సోదరుడికి చెప్పింది. అనుమానం వచ్చిన అతడు డాక్టర్ దగ్గరికి వెళ్లి కరోనా శాంపిల్ యోని నుంచి తీస్తారా అని అడిగాడు. కరోనా శాంపిళ్లను అలా తీయరని డాక్టర్ చెప్పాడు. దీంతో తన సోదరి మోసపోయిందని గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా... పోలీసులు సదరు ల్యాబ్ టెక్నీషియన్ ని అరెస్టు చేశారు. అతనిపై అత్యాచారం నేరం కింద కేసు నమోదు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios