కింజరపు రామ్మోహన్ నాయుడు : బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం,
Kinjarapu Ram Mohan Naidu: వయసులో చిన్నవాడు కానీ ప్రజల కోసం గళం వినిపించడంలో పెద్దవాడు రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ లోనే కాక కేంద్ర స్థాయిలో సైతం తన ఉనికిని చాటుకున్న పిక్కోలు సింగం కింజరపు రామ్మోహన్ నాయుడు. తన తండ్రి ఆదర్శాలను పాటిస్తూ శ్రీకాకుళంలో అభివృద్ధి పనులు చేస్తున్నారు. వీడు మనోడ్రా బుజ్జీ అనేలా గర్భంగా చెప్పుకునే స్థాయికి ఎదిగిన యువ నాయకుడు రామ్మోహన్ నాయుడు. ఆయన రాజకీయ జీవితం గురించిన ఎన్నో ముఖ్యమైన విషయాలు మీ కోసం..
Kinjarapu Ram Mohan Naidu Biography :
బాల్యం, విద్యాభ్యాసం
కింజరపు రామ్మోహన్ నాయుడు 1987 డిసెంబర్ 18న శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మడలో జన్మించారు. ఆయన తండ్రి గారి పేరు ఎర్రం నాయుడు, తల్లిగారు విజయ్ కుమారి. ఆయన తండ్రి ఎర్రం నాయుడు.. టిడిపిలో ప్రధాన నాయకుడు. ఆయన హరిచంద్రపురం శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు వరుసగా పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గ నుండి వరుసగా నాలుగు సార్లు ఎంపిక గెలిచారు. 1996-98 మధ్య కాలంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2012 నవంబర్ లో జరిగిన ఒక రోడ్డు యాక్సిడెంట్ లో ఎర్రం నాయుడు ప్రాణాలు కోల్పోయారు. ఇక రామ్మోహన్ నాయుడికి ఒక అక్క ఉంది. ఆమె పేరు ఆదిరెడ్డి భవాని ఆమె కూడా టిడిపిలో నాయకురాలుగా కాగా రాజమండ్రి సిటీ శాసనసభ నియోజకవర్గం నుండి మొదటిసారి పోటీచేసి 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు
విద్యాభ్యాసం
రామ్మోహన్ నాయుడు ఒకటి నుండి 3వ తరగతి వరకు శ్రీకాకుళం లోని గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ హాస్టల్లో ఉంటూ చదువుకున్నాడు రామ్మోహన్ నాయుడు . 1994లో ఎర్ర నాయుడు తెలుగుదేశం పార్టీ చీఫ్ విప్గా ఎన్నికయ్యారు. ఆయన రాజధాని హైదరాబాద్ లో ఎక్కువగా ఉండేవారు. దీంతో పిల్లలు చదువు నిమిత్తం వారి కుటుంబం శ్రీకాకుళం నుండి హైదరాబాద్ కు తరలింది కింజరాపు గారి కుటుంబం. రామ్మోహన్ నాయుడు హైదరాబాదులోని భారతీయ విద్యా భవన్లో 4 5వ తరగతిలో చదువుకున్నాడు. 1996 ఎన్నికల్లో ఎర్రం నాయుడు లోకసభ సభ్యుడిగా గెలుపొందారు. దీంతో ఆయనకు కేంద్ర ప్రభుత్వ మంత్రిగా అవకాశం తగ్గడంతో రామ్మోహన్ రావు కుటుంబం ఢిల్లీకి మార్చింది. 1998 నుంచి 2004 వరకు అంటే ఇంటర్ వరకు ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివారు.ఆ తర్వాత అమెరికాలోని స్లోనివిశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత లాంగ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తి చేశారు. పట్టభద్రులయ్యాక ఒక సంవత్సరం పాటు సింగపూర్లో ఉద్యోగ పనిచేసి స్వదేశానికి తిరిగి వచ్చాడు రామ్మోహన్ నాయుడు. రామ్మోహన్ నాయుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకోవడం వలన అతనికి హిందీ మీద మంచి పట్టు వచ్చింది. ఆ పట్టే ఈరోజు అతన్ని పార్లమెంట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.
రాజకీయ ప్రస్థానం
రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రం నాయుడు చనిపోయిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 2013లో టిడిపి నుండి రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా పనిచేయడం మొదలుపెట్టారు. 2013 అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ విభజన మీద పోరాటంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు గారికి మద్దతునిస్తూ ఢిల్లీలో నిరాహార దీక్షలో ఆయన కూర్చున్నారు. ఇక 2014 శ్రీకాకుళం లోక్సభ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసి 1,27,576 ఓట్ల మెజారిటీతో గెలిచి ప్రభంజనం స్రుష్టించారు.
ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఆంధ్రకు కేంద్రం విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామని ప్రకటించగా దాన్ని పట్టించుకోవడంలేదని 2018 అక్టోబర్లో ఆముదాలవలస రైల్వే స్టేషన్లో రాత్రంతా ప్లాట్ఫారం మీద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. అయితే దానికి ముందే 2018 ఫిబ్రవరిలో కేంద్రం ఏపీ రిహార్గనైజేషన్ ప్రకారం అందించాల్సిన అనేది ఇవ్వడం లేదని ఢిల్లీలో పార్లమెంటు వద్ద టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కే శివప్రసాద్, టీజీ వెంకటేష్ , కిష్టప్ప నారాయణరావు తదితరులు రామ్మోహన్ నాయకత్వంలోనే నిరసన వ్యక్తం చేశారు.
2019 ఎన్నికల్లో పోటీ చేసి ఆయన 60653 ఓట్ల మెజారిటీతో గెలిచారు .అయితే 2019 ఎన్నికల్లో టిడిపి నుండి కేవలం ముగ్గురు ఎంపీల గెలవగా వారిలో రామ్మోహన్ గారు ఒకరు. ఇక 2019 కాగా 69 ప్రశ్నలను అడిగారు. అలాగే.. పార్లమెంట్ ప్రశ్నలు డిబేట్స్ యావరేజ్ నెంబర్ కంటే పెద్దవి కావడం విశేషం అలానే ఆయన మీద ఎలాంటి కేసులు లేకపోవడంతో 2021 గాను ప్రతిష్టాత్మక సంసాధ్ అవార్డుకి రామ్మోహన్ ఎన్నికయ్యారు. సుప్రియ సులే వంటి దిగ్గజాల మధ్య ఆయన పేరు కూడా వినపడింది
ఆయన విలువైన పనితీరు కృషికిగాను జ్యూరీ కమిటీ స్పెషల్ అవార్డు ఆయనకు దక్కింది. విశేషం ఏమిటంటే ఈ అవార్డు అందుకున్న ఏకైక తెలుగు వాడే కాదు.. అతి చిన్న వయసులో ఈ అవార్డు అందుకున్న వ్యక్తిగా కేంద్ర స్థాయిలో తన పేరు మీద చరిత్ర లిఖించారు.
నిరాయుధీకరణ మీద భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి విధానాలను ఇండియా పరిరక్షిస్తుందని మిత్ర దేశాలతో తామరస్యంగా ఉంటుందని పేర్కొన్నారు అలానే న్యూక్లియర్ ఆయుధాలను వినియోగ నిర్మూలన వంటి విషయాలను ఇండియా తరపున ఐక్యరాజ్యసమితిలో వినిపించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు.
ఇక యువతరం రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని యువతరం వలన రాష్ట్ర దేశ రాజకీయాల్లో అభివృద్ధి నిత్య నూతన పోకడలు వస్తాయని విశ్వసిస్తూ పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్ అనే ఒక ఇంటర్షిప్ ప్రోగ్రామ్ మొదలుపెట్టారు. అయితే దీనికి దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలలోని 130 కాలేజీలకు చెందిన 210 మంది విద్యార్థులు అప్లై చేయగా 18 మందిని ఎంపిక చేసి ఆయన సొంత నియోజకవర్గంలో సమస్యల మీద పనిచేసేలా రెండు నెలలు ప్రోగ్రాములు చేశారు.
2019 మే లో ఏపీలో జగన్ గారి ప్రభుత్వం రాగానే ఇసుక మీద కొత్త పాలసీని ,జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన 2019 అక్టోబర్లో ప్రముఖ వెబ్ పోర్టల్ లో ఇసుక మైనింగ్ పాలసీ గురించి ఆర్టికల్ రాశారు. ఆయన ఎంపీగా ఒక నాయకుడిగా తన నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉండి అందరిని కలుస్తూ వివిధ రకాలుగా నిధులు కలెక్ట్ చేసి వారికి సహాయం చేస్తున్నారు. ఆయన ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలను కేరాఫ్ గా నిలువలేదు. ఈ విధంగా వయసుకు చిన్నవాడే ఆయన ప్రజలకు పెద్దగా నిలిచి వారి కష్టాలను తీర్చే పదవిలో ఉంటూ తన కర్తవ్య దీక్షలో నిరంతరం శ్రమించే కింజరపు రామ్మోహన్ నాయుడు భవిష్యత్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా నాయకుడిగా ఎదిగారు. ఆయన రానున్న ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాం.
కింజారపు రామ్మోహన్ నాయుడు బయోడేటా
పూర్తి పేరు: రామ్మోహన్ నాయుడు కింజారపు
పుట్టిన తేదీ: 18 Dec 1987
పుట్టిన ప్రాంతం: నిమ్మాడ, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్
పార్టీ పేరు : Telugu Desam
విద్య: Post Graduate
వృత్తి: వ్యాపారవేత్త
తండ్రి పేరు: ఎర్రన్నాయుడు కింజారపు
తల్లి పేరు శ్రీమతి: విజయకుమారి కింజారపు
జీవిత భాగస్వామి: శ్రావ్య బండారు
ఈ-మెయిల్ rammohannaidu.k@sansad.nic.in