ధర్మశాలలో ప్రభుత్వ భవనంపై ఖలిస్తాన్ జెండాలు కలకలం..
Dharamsala: హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ప్రభుత్వ భవనంపై 'ఖలిస్తాన్ జిందాబాద్' నినాదాలు, ఖలిస్తాన్ జెండాలు కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే కేసు నమోదుచేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. కాంగ్రా పోలీసు సూపరింటెండెంట్, షాలిని అగ్నిహోత్రి మాట్లాడుతూ, కొన్ని వివాదాస్పద అంశాలు, నినాదాలను భవనం గోడలపై కలర్ పెయింట్ చేశారు. ఈ ఘటన క్రమంలో అక్కడి సీసీటీవీ కెమెరా దృశ్యాలను చెక్ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Khalistan slogans on govt building: హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ప్రభుత్వ భవనంపై 'ఖలిస్తాన్ జిందాబాద్' నినాదాలు, ఖలిస్తాన్ జెండాలు కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే కేసు నమోదుచేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. కాంగ్రా పోలీసు సూపరింటెండెంట్, షాలిని అగ్నిహోత్రి మాట్లాడుతూ, కొన్ని వివాదాస్పద అంశాలు, నినాదాలను భవనం గోడలపై కలర్ పెయింట్ చేశారు. ఈ ఘటన క్రమంలో అక్కడి సీసీటీవీ కెమెరా దృశ్యాలను చెక్ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జలశక్తి డిపార్ట్‌మెంట్ భవనం గోడపై 'ఖలిస్తాన్ జిందాబాద్' నినాదాలు కనిపించడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు బుధవారం తెలిపారు. కాంగ్రా పోలీసు సూపరింటెండెంట్, షాలిని అగ్నిహోత్రి మాట్లాడుతూ.. భవనం గోడలపై వివాదాస్పద వ్యాఖ్యలను కలర్ పెయింట్ చేయడం, ఖలిస్తాన్ జెండాలు స్థానికంగా కలకలం రేపాయన్నారు. దీనికి సంబంధించి మంగళవారం రాత్రి అధికారులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం గోడకు రంగులు వేయించినట్లు తెలిపారు.
ఈ ఘటన వెనుక ఎవరున్నారో తెలుసుకునేందుకు కేసు నమోదు చేసి, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని అగ్నిహోత్రి తెలిపారు. కాగా, వన్డే క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఐదు మ్యాచ్‌లు అక్టోబర్‌లో ధర్మశాలలో జరగనున్నాయి. ఇప్పటికే పలు జట్లు నగరానికి చేరుకోవడం ప్రారంభించినందున ఈ సంఘటన ఆందోళన కలిగించిందని అధికారులు తెలిపారు.