Kerala secretariat:: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పై  అనుచిత వ్యాఖ్యలు చేసిన సెక్రటేరియట్ ఉద్యోగి విధుల నుంచి తొలగించారు.  

Kerala secretariat: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై ఆ రాష్ట్ర సెక్రటేరియట్ ఉద్యోగి ఒకరు అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం తీవ్ర‌దూమారం రేగింది. దీంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సీఎం కార్యాల‌యం ఆ ఉద్యోగిని సస్పెండ్ చేసింది. అస‌లు.. ఆ సెక్రటేరియట్ ఉద్యోగికి చేసిన త‌ప్పిదమేంటీ? ఎందుకు ఆ ఉద్యోగిని తొలిగించారంటే?

వివరాల్లోకి వెళితే.. ఇటీవల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దుబాయ్ ప‌ర్య‌టించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా దుబాయ్ ఎక్స్‌పో 2020 పాల్గొన్నారు. ఈ త‌రుణంలో కేరళలో పెట్టుబడులు పెట్టాల‌ని, అక్కడి విదేశీ వాణిజ్య మంత్రిత్వశాఖ, మానవవనరుల అభివృద్ధిశాఖతో సమావేశం అయ్యారు. ఈసందర్భంగా యూఏఈ మంత్రులు, అధికారులతో కలిసి దిగిన ఫోటోను సీఎం పినరయి విజయన్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫోటోలో సీఎం విజయన్ నల్ల సూట్, ప్యాంటు ధరించి, చొక్కా టక్‌తో ఉన్న ఫోటోలను పోస్ట్ చేశారు.

అయితే.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది, కాంగ్రెస్ అనుకూల సచివాలయ ఉద్యోగుల సంఘం సభ్యుడు ఎ మణికుట్టన్ .. ఈ పోస్టుపై వివిధ వేషధారణలో గూండాలు.. అంటూ సీఎంపై మణికుట్టన్..అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంత‌టితో ఆగ‌కుండా.. మణికుట్టన్ తన వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేశాడు. ఈ విషయాన్నీ కొందరు సచివాలయ అధికారులు సీఎం కార్యాలయం దృష్టికి తీసుకెళ్లగా.. మణికుట్టన్ ను విధుల నుంచి తప్పించారు. కాగా మణికుట్టన్ కాంగ్రెస్ అనుకూల సచివాలయ ఉద్యోగుల సంఘంలో సభ్యుడిగా ఉన్నాడు. కాబ‌ట్టే.. అతనిపై కక్షకట్టిన అధికార పార్టీ అనుకూల ఉద్యోగులు ఈ దుశ్చ‌ర‌కు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.