కులాంతర వివాహం చేసుకుంటే చంపేస్తారా : నవదంపతుల ఆవేదన

Kerala latest intercaste marriage
Highlights

ప్రేమించుకున్నాం.  పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవించాలనుకుంటున్నాం. అయినా కులాల గురించి తమకు లేని పట్టింపు మీకెందుకంటూ ఇటీవలే కులాంతర వివాహం చేసుకున్న నవ దంపతులు ఫేస్ బుక్ ద్వారా ప్రశ్నించారు. తమ ఆవేధనను, వస్తున్న బెదిరింపుల గురించి ఓ వీడియోలో వెల్లడించిన దంపతులు దాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది.

కేరళ లోని తిరువనంతపురం ప్రాంతానికి చెందిన హ్యారిసన్ అనే క్రిస్టియన్ యువకుడు , షహానా అనే ముస్లీం యువతి పెద్దలను ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్నారు. ఇలా రెండు రోజుల క్రితం పెళ్లిచేసుకుని ఆ ఫోటోలను హ్యారిసన్ తన వ్యక్తిగత పేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అయితే ఈ వివాహం పై అభ్యంతరం వ్యక్తం చేసిన ఓ సామాజిక వర్గానికి చెందిన పార్టీ నుండి అతడికి బెదిరింపులు ఎదురయ్యాయి. 

దీంతో హ్యారిసన్ తన భార్య తో కలిసి మరో వీడియోను పేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. తీవ్రవాద బావాలున్న కొన్ని సంస్థలు తమను చంపేస్తామని బెదిరిస్తున్నాయని ఈ దంపతులు తమ ఆవేధనను వీడియోలో తెలిపారు. తమనే కాకుండా తమ తల్లిదండ్రులను చంపేస్తామంటున్నారని, ఇలా చంపితే మీకేం వస్తుందంటూ వీరు సదరు సంస్థను ప్రశ్నించారు. తాము ఆనందంగా జీవించాలని ఇస్టపడి పెళ్లి చేసుకున్నామని, ఇలా అర్థాంతరంగా చావడానికి కాదని ఈ నవ దంపతులు తెలిపారు.

loader