Asianet News TeluguAsianet News Telugu

ఇండియన్ ఆర్మీని పెళ్లికి ఆహ్వానించిన కేరళ జంట.. నెటిజన్ల మనసు గెలుచుకుంటున్న ఆర్మీ రిప్లై..

దేశ రక్షణ కోసం ఆర్మీ ఎంతగానో శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి ఆర్మీని తమ పెళ్లికి ఆహ్వానించాలని బావించింది కేరళకు చెందిన ఓ జంట.. ఈ క్రమంలోనే వారికి ఆహ్వానం పంపింది. 

Kerala couple invites Indian Army for their wedding and receive Reply wins hearts
Author
First Published Nov 20, 2022, 3:23 PM IST

దేశ రక్షణ కోసం ఆర్మీ ఎంతగానో శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి ఆర్మీని తమ పెళ్లికి ఆహ్వానించాలని బావించింది కేరళకు చెందిన ఓ జంట. అనుకున్నదే తడువుగా ఇండియన్ ఆర్మీని తమ వివాహానికి ఆహ్వానిస్తూ వారికి ఓ నోట్‌తో కూడిన వెడ్డింగ్ ఇన్విటేషన్‌ను పంపింది. అయితే ఆ కార్డు అందుకున్న ఇండియన్ ఆర్మీ  అంతే సంతోషంగా జవాబిచ్చింది. కలకాలం కలిసి ఉండాలంటూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు వారి ఆహ్వానాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఇండియన్ ఆర్మీ.. జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేసింది. 

వివరాలు.. కేరళకు చెందిన రాహుల్, కార్తీక‌లు నవంబర్ 10వ తేదీన వివాహం చేసుకున్నారు. అయితే వారు తమ వివాహానికి ఇండియన్ ఆర్మీని ఆహ్వానించాలని భావించారు. ఈ క్రమంలోనే వారికి తమ పెండ్లి పత్రికతో పాటు.. ఓ నోట్‌ను కూడా పంపారు. డియర్ హీరోస్ అని పేర్కొంటూ రాసిన ఆ నోట్‌లో.. ‘‘మా జీవితంలో ప్రత్యేకమైన రోజున మిమ్మల్ని ఆహ్వానిస్తుందుకు సంతోషిస్తున్నాం. మీ ఆశీర్వాదాలను మేము కోరుకుంటున్నామని’’ అని వారు పేర్కొన్నారు. 

‘‘మేము (రాహుల్ అండ్ కార్తీక) నవంబర్ 10న పెళ్లి చేసుకోబోతున్నాం. దేశం పట్ల ఆర్మీకి ఉన్న ప్రేమ, సంకల్పం, దేశభక్తికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మమ్మల్ని సురక్షితంగా ఉంచినందుకు మేము మీకు రుణపడి ఉంటాము. మీ వల్ల మేము ప్రశాంతంగా నిద్రపోతున్నాం. మా ప్రియమైన వారితో మాకు సంతోషకరమైన రోజులను అందించినందుకు ధన్యవాదాలు. మీ కారణంగా.. మేము సంతోషంగా వివాహం చేసుకోబోతున్నాం. మేము మా ప్రత్యేక రోజున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. మీరు వివాహ వేడుకకు హాజరై.. మమ్మల్ని ఆశీర్వాదాలను మేము కోరుకుంటున్నాము’’ అని రాహుల్, కార్తీకలు నోట్‌లో పేర్కొన్నారు. 

 


దీనికి స్పందనగా ఇండియన్ ఆర్మీ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఆ ఆహ్వానాన్ని షేర్ చేసింది. ‘‘శుభాకాంక్షలు. వివాహ ఆహ్వానం పంపినందుకు రాహుల్ అండ్ కార్తీకలకు ఇండియన్ ఆర్మీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఈ జంట చాలా సంతోషంగా, ఆనందకరమైన వివాహ జీవితాన్ని కలిగిఉండాలని కోరుకుంటున్నాం #TogetherForever’’ అని ఇండియన్ ఆర్మీ పేర్కొంది. రెండు రోజుల క్రితం షేర్ చేసిన ఈ పోస్టుకు ఇప్పటివరకు లక్ష మందికి పైగా లైక్ చేశారు. కొత్త జంటకు శుభాకంక్షలు తెలుపుతూ ఇండియన్ ఆర్మీ ఇచ్చిన రిప్లై  పలువురి మనసులను గెలుచుకుంది. చాలా మంది ఈ పోస్టుకు పాజిటివ్‌గా కామెంట్స్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios