చైనా వీసా స్కాంలో కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబబరం గురువారం నాడు సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. వీసా స్కాంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ ఇచ్చిన నోటీసులిచ్చింది.
న్యూఢిల్లీ: చైనీస్ Visa స్కాం కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరం తనయుడు ఎంపీ Karti Chidambaram గురువారం నాడు CBI ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.ఈ విషయమై విచారణకు రావాలని సీబీఐ కార్తి చిదంబరానికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
China వీసా కుంభకోణం కేసులో ఇవాళ విచారణకు హాజరు కావాలని కార్తి చిదంబరానికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతితో కార్తి చిదంబరం యూకేకు వెళ్లాడు. యూకే నుండి తిరిగి వచ్చిన తర్వాత కార్తి చిదంబరం విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది.ఈ నోటీసులకు అనుగుణంగా ఇవాళ విచారణకు గాను కార్తి చిదంబరం సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.
also read:కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సన్నిహితుడిని అరెస్ట్ చేసిన సీబీఐ..
Punjab లో వేదాంత గ్రూప్ ఏర్పాటు చేస్తున్న పవర్ ప్లాంట్ కి చెందిన ఎగ్జిక్యూటివ్ రూ. 50 లక్షలను కార్తి చిదంబరంతో పాటు అతని సన్నిహితుడు ఎస్, భాస్కర రామన్ కు చెల్లించినట్టుగా సీబీఐ ఆరోపణలు చేసింది.
ఈ పవర్ ప్లాంట్ పనులను చైనా కంపెనీ నిర్వహిస్తుంది. ఈ కంపెనీ ఎగ్జిక్యూటివ్ 263 చైనా కార్మికులకు వీసా కోసం రూ. 50 లక్షలు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి.ఈ విషయమై సీబీఐ FIR నమోదు చేసింది.ఈ ఆరోపణలను కార్తి చిదంబరం ఖండించారు. కార్తి చిదంబరంపై కేసులను వేధింపులుగా కాంగ్రెస్ ఎంపీలు విమర్శించారు. తమ పవర్ ప్రాజెక్టుకు కేటాయించిన వీసాలను తిరిగి ఉపయోగించాలని కోరుతూ 2011 జూలైలో హోంమంత్రిత్వ శాఖకు ఓ లేఖఇచ్చారు. అయితే నెలలోనే ఈ వీసాలకు ఆమోదం లభించిందని సీబీఐ ఆరోపిస్తుంది.
సీబీఐ విచారణకు హాజరు కావడానికి ముందు మీడియాతో కార్తి చిదంబరం మీడియాతో మాట్లాడారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ కేసులన్నీ కూడా బూటకపు కేసులుగా ఆయన చెప్పారు. తనను రాజకీయంగా బలి పశువును చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తనపై నమోదైన కేసులన్నీ బోగస్ కేసులని కార్తి చిదంబరం చెప్పారు. తనపై నమోదు చేసిన ప్రతి కేసు బోగస్ కేసేనని ఆయన చెప్పారు. చైనా దేశీయులకు తాను వీసాలు పొందడానికి సహకరించలేదని కార్తి చిదంబరం స్పష్టం చేశారు.
ఈ కేసుపై ఈ నెల 24న కార్తి చిదంబరం ఓ ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. తనను కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసిందన్నారు. తనపై కేంద్ర ప్రభుత్వం కల్పిత ఆరోపణలతో ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగించి దర్యాప్తు చేయిస్తుందన్నారు. ప్రభుత్వ సంస్థలన్నీ ఒకే పార్టీ యంత్రాంగంగా మారాయన్నారు.
