సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి(111) శివైక్యం చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శివకుమార స్వామి.. బెంగళూరులోని సిద్ధగంగ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. కాగా.. ఈ రోజు ఉదయం ఆస్పత్రిలోనే తుది శ్వాస విడిచారు.

కాగా.. ఆయన మృతి పట్ల కర్ణాటక సీఎం కుమారస్వామి తీవ్ర దిగ్భాంత్రికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. శివకుమార స్వామి మృతి కారణంగా మంగళవారం కార్ణాటక రాష్ట్రంలో విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తున్నట్లు కర్ణాటక ముఖ్య మంత్రి కుమారస్వామి తెలిపారు. మంగళవారం సాయంత్రం 4గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సిద్ధగంగ మఠాధిపతులు తెలిపారు.