ఉన్నప్పుడు నిత్యం గొడవపడ్డాడు.. తీరా ఆమె విడిచి వెళ్లిపోయాక ఇప్పుడు వెనక్కి రావాలంటూ కొబ్బరి చెట్టెక్కి మరీ నిరసన చేస్తున్నాడు. ఇది కర్ణాటకలోని ఓ భర్త విచిత్ర నిరసన. వివరాల్లోకి వెడితే.. కర్ణాటకలో ఓ భర్త తనను విడిచిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను వెనక్కి రప్పించాలంటూ కొబ్బరి చెట్టు ఎక్కి నానా హంగామా చేశాడు. 

ఇంటిని, ముగ్గురు కొడుకుల్ని చూసుకోవడం తన వల్ల కావడం లేదంటూ 8 గంటలకు చెట్టుపైనే ఉండిపోయాడు. కూడ్లిగి తాలూకాకు చెందిన 40 ఏళ్ల దొడ్డప్ప తరచుగా భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ గొడవలతో విసిగిపోయిన భార్య ఐదేళ్ల క్రితం పిల్లల్ని దొడ్డప్ప వద్దే వదిలి... పుట్టింటికి వెళ్లిపోయింది.

కొద్ది రోజులు ఎలాగో నెట్టుకొచ్చిన దొడ్డప్పకు రాన్నాను ఇల్లు, పిల్లల్ని చూసుకోవడం కష్టంగా మారింది. దీంతో భార్య వెనక్కి తిరిగి రావాలంటూ చెట్టెక్కి హంగామా చేశాడు దొడ్డప్ప. కొబ్బరి చెట్టు ఎక్కిన దొడ్డప్ప కాసేపటి తర్వాత దిగిపోతాడని గ్రామస్తులు భావించారు. 

అయితే, 8 గంటలైనా అతను దిగకపోగా, తన భార్యను పిలిపించకపోతే చెట్టు పైనుంచి దూకి చచ్చిపోతానంటూ బెదిరించాడు. అంతేకాదు తనను, తన భార్యను కలపాల్సిన బాధ్యత గ్రామస్తులదే అంటూ మెలిక పెట్టాడు. దీంతో ఆమెకు నచ్చజెప్పి, కాపురాన్ని చక్కదిద్దుతామని గ్రామస్తులు నచ్చజెప్పడంతో దొడ్డప్ప చెట్టు దిగాడు.