Asianet News TeluguAsianet News Telugu

గేదే దొంగతనం కేసు.. 58 ఏళ్ల తర్వాత 78 ఏళ్ల నిందితుడి అరెస్ట్..

గేదెలను దొంగిలించిన నిందితుడిని కర్ణాటక పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. 58 ఏళ్లుగా బెయిల్‌పై పరారీలో ఉన్న 74 ఏళ్ల విట్టల్‌ను బీదర్‌లో అరెస్టు చేశారు. అయితే, అరెస్టు అనంతరం కోర్టు ముందు హాజరుపరచగా, వయోభారం కారణంగా మళ్లీ బెయిల్‌పై విడుదలయ్యారు.

Karnataka man arrested for stealing buffaloes 58 years ago KRJ
Author
First Published Sep 14, 2023, 1:55 AM IST | Last Updated Sep 14, 2023, 1:55 AM IST

కర్ణాటక లో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఉదగిర్‌లో గేదెను దొంగిలించాడనే ఆరోపణలపై 58 ఏండ్ల తర్వాత ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే, అరెస్టు అనంతరం కోర్టు ముందు హాజరుపరచగా, వయోభారం కారణంగా మళ్లీ బెయిల్‌పై విడుదలయ్యారు. వాస్తవానికి గణపతి విఠల్ వాగోర్ అనే వ్యక్తి 1965లో గేదెను దొంగిలించారని ఆరోపించారు.

ఆ సమయంలో అతని వయస్సు 20  ఏండ్లు. ఇప్పుడు వాగోర్ వయసు 78 ఏళ్లు. నివేదికల ప్రకారం.. వాగోర్‌ కర్ణాటకలోని బీదర్‌లో వాగోర్ గేదె, దూడను దొంగిలించాడు. బాధితుడు పోలీసులకు చేయడంతో ఈ కేసులో వాగర్‌ను నిందితుడుగా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వాగోర్ దొంగిలించిన గేదెను వెంటనే స్వాధీనం చేసుకుని యజమానికి అప్పగించారు.

ఈ దొంగతనంలో వాగోర్ ఒక్కడే కాదు. అతని సహచరుడు కూడా కృష్ణ చందర్. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అయితే, బెయిల్ పొందిన తర్వాత వారు మహారాష్ట్రకు పరారీ అయ్యారు. దీని తరువాత కోర్టు కేసును LPC (లాంగ్ పెండింగ్ కేసు) కింద జాబితా చేసింది. ఇప్పుడు ఈ కేసులో వాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వాగర్‌ సహచరుడు కృష్ణ చందర్ 2006లో మరణించారు.

గేదె, దూడ యజమాని కులకర్ణి కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు.  బీదర్ ఎస్పీ చెన్నబసవన్న లంగోటి మీడియాతో మాట్లాడుతూ గేదెల దొంగ వాగోర్ చాలా ఏళ్లుగా కన్నుగప్పి తిరుతున్నాడని పోలీసులు తెలిపారు. ఎట్టకేలకు 58 ఏండ్ల తర్వాత అతడిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అయితే.. అరెస్టు అనంతరం కోర్టు ముందు హాజరుపరచగా, వయోభారం కారణంగా మళ్లీ బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే.. అరెస్టు అనంతరం కోర్టు ముందు హాజరుపరచగా, వయోభారం కారణంగా మళ్లీ బెయిల్‌పై విడుదలయ్యారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios