భారతదేశం షరియత్ తో కాదు రాజ్యాంగంతో నడుస్తుందంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ స్పందించారు. గత కొన్ని రోజులుగా కర్ణాటకలో చర్చనీయాంశంగా మారిన హిజాబ్ వివాదం మీద తనదైన శైలిలో స్పందించారు. 

న్యూఢిల్లీ : Karnataka hijab row మీద ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి Yogi Adityanath స్పందించారు. భారతదేశం Constitution ప్రకారం నడుస్తుందని, Shariat చట్టం ప్రకారం కాదని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. హిజాబ్ వివాదంపై ఆదిత్యనాథ్ తొలిసారిగా ఓ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి సంస్థకు తమ సొంత Dress code‌ను రూపొందించుకునే హక్కు ఉందని, అయితే రాజ్యాంగం ప్రకారమే వ్యవస్థ నడపాలని అన్నారు.

“దేశ వ్యవస్థ షరియత్ తో కాకుండా రాజ్యాంగం ద్వారా నడుస్తుంది, క్రమశిక్షణకు డ్రెస్ కోడ్ ఉంది, ప్రతి సంస్థకు దాని స్వంత దుస్తుల కోడ్‌ను రూపొందించుకునే హక్కు ఉంది, అయితే అది భారత రాజ్యాంగం ప్రకారం జరిగేలా చూడాలి. ఇది ప్రతి ఒక్కరికీ ఆసక్తిని కలిగిస్తుంది”అని ఆయన అన్నారు.

అంతకుముందు శుక్రవారం, కర్ణాటక హైకోర్టు, హిజాబ్ వివాదానికి సంబంధించిన అన్ని పిటిషన్ల పరిశీలన పెండింగ్‌లో ఉన్నాయని, విద్యా సంస్థలను తిరిగి తెరవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది. విద్యార్థులందరూ తరగతి గది లోపల కాషాయ కండువాలు, హిజాబ్ లాంటి మతపరమైన దుస్తులు ధరించకుండా నిషేధించింది. 

ఫిబ్రవరి 14 నుండి హైస్కూల్ లు, ఆ తరువాత ప్రీ-యూనివర్శిటీ, డిగ్రీ కళాశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో శాంతిభద్రతలను పరిరక్షించడం, హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించవద్దని దీనికోసం కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా యంత్రాంగాలకు వరుస ఆదేశాలు జారీ చేసింది. 

సీఎం బసవరాజ్ బొమ్మై కొంతమంది మంత్రులు, డిప్యూటీ కమిషనర్లు (డీసీలు), పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీలు), పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ డిప్యూటీ డైరెక్టర్ (డీడీపీఐలు), అన్ని జిల్లాల జిల్లా పంచాయతీల సీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ground situationని సమీక్షించారు.

ఉన్నత విద్యా శాఖకు చెందిన విశ్వవిద్యాలయాలు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కాలేజియేట్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (DCTE) పరిధిలోని కళాశాలలకు ప్రకటించిన సెలవులు ఫిబ్రవరి 16 వరకు పొడిగించబడ్డాయి.

కాగా, ఈ వివాదం ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠకు తెరలేపింది. తాజాగా వివాదంపై అమెరికా కామెంట్ చేసింది. హిజాబ్ వివాదం పై న్యాయ విచారణ జరుగుతున్న సమయంలో.. అంతర్గత సమస్యలపై ప్రేరేపిత వ్యాఖ్యలను స్వాగతించబోమని భారత్ పేర్కొంది. అమెరికా, తదితర దేశాలకు భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. 

మీడియా ప్రశ్నలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పందిస్తూ.. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతోందని, పరిపాలన, ప్రజాస్వామిక అంశాలకు సంబంధించిన సమస్యలను భారత దేశ రాజ్యాంగ నిబంధనావళి పరిశీలించి, పరిష్కరిస్తుందన్నారు. భారత దేశ అంతర్గత వ్యవహారాలపై ప్రేరేపిత వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. ఇండియా గురించి పూర్తిగా తెలిసిన‌వారే ఈ విష‌యాల‌ను మెచ్చుకుంటార‌ని, అంత‌ర్గ‌త అంశాల‌పై అనుచిత వ్యాఖ్య‌ల‌ను స్వాగ‌తించ‌డంలేద‌ని అరిందం త‌న ట్వీట్‌లో తెలిపారు.

Scroll to load tweet…