బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి. తన తొలిశత్రువు బీజేపీ కాదని కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత సిద్ధరామయ్య అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలడానికి సిద్ధరామయ్యే కారణమంటూ పలు రోజులుగా ఆరోపిస్తున్నారు. తాను సీఎంగా ఉండటాన్ని సిద్ధరామయ్య సహించలేకపోయారని కుమారస్వామి ఆరోపించారు. 

సిద్ధరామయ్య తన సన్నిహిత ఎమ్మెల్యేల ద్వారా ఎప్పటకప్పుడు తమ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతూ చివరికి వారిచేతే రాజీనామాలు చేయించారని ఆరోపించారు. ప్రభుత్వం కూలిపోవడానికి కారకులయ్యారంటూ మండిపడ్డారు. 

కర్ణాటక రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తప్పక సిద్ధరామయ్య ఒప్పుకున్నారని చెప్పుకొచ్చారు. ఇష్టం లేకపోయినా తనను బలవంతంగా ముఖ్యమంత్రిగా అంగీకరించారని చెప్పుకొచ్చారు. 

సిద్ధరామయ్య ఒత్తిడి మేరకే రాష్ట్ర ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని చెప్పుకొచ్చారు. సంకీర్ణ ప్రభుత్వంలో తాను ముఖ్యమంత్రిగా కాకుండా, క్లర్క్‌గా పనిచేసినట్లు చెప్పుకొచ్చారు. సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్‌ నేతలు తనపై పెత్తనం చేసేవారని ఆరోపించారు. 

కలెక్టర్ దగ్గర నుంచి చిన్న స్థాయి అధికారుల వరకు వారి చెప్పినట్లే బదిలీలు చేసినట్లు చెప్పుకొచ్చారు కుమారస్వామి. ఇలా సంచలన వ్యాఖ్యలు చేసిన కుమారస్వామి సాయంత్రానికే మాటమార్చేశారు. సిద్ధరామయ్య తన తొలి శత్రువు అని ఏనాడు అనలేదని కుమారస్వామి చెప్పుకొచ్చారు.  
 

ఈ వార్తలు కూడా చదవండి

బిర్యానీ తినడానికి టైం ఉంటుందా..:మాజీ సీఎం సిద్ధరామయ్యపై బీజేపీ ఫైర్