బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వరదల కారణంగా కర్ణాటక రాష్ట్రం అల్లాడుతోంది. కొన్ని ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.  

వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ విస్తృతంగా పర్యటిస్తోంది. సీఎం యడ్యూరప్ప ఏరియల్ సర్వేలు సైతం నిర్వహించారు. అయితే కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష నేత సిద్ధరామయ్య అనారోగ్యం కారణంగా పర్యటించలేనని ప్రకటించారు. 

కానీ బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి విందు ఆరగించిన ఫోటోలు బయటకు రావడంతో బీజేపీ ఓ ఆట ఆడుకుంది. వరద ప్రాంతాల్లో పర్యటించడానికి సమయం చిక్కదు కానీ బిర్యానీ తినడానికి మాత్రం సమయం ఉంటుందా? అంటూ నిలదీసింది.  

ఇకపోతే తనకు కంటి ఆపరేషన్ జరిగిన కారణంగా వైద్యులు పర్యటించరాదని తనకు సూచించారని, అందువల్లే తన సొంత నియోజకవర్గమైన బాదామీలో పర్యటించలేకపోతున్నట్లు సిద్ధరామయ్య ఆగస్టు 9 న ట్విట్ చేశారు. ఈ కారణం చేతనే తాను వరద బాధితులను పరామర్శించలేకపోతున్నానని చెప్పుకొచ్చారు. దాంతో బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది.