Karnataka: కర్నాటకలోని గౌరిబిదనూర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎలుకలు బీభత్సాన్ని సృష్టించాయి. స్టేషన్‌లో ముఖ్యమైన ఫైళ్లను ఎలుకలు ధ్వంసం చేయడం ప్రారంభించాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి స్టేషన్ ప్రాంగణంలో రెండు పిల్లులను ఏర్పాటు చేశారు.
Karnataka: సాధారణంగా ఎలుకలు ఇండ్లల్లో ఎలాంటి బీభత్సం సృష్టిస్తాయో తెలుసు. బియాన్ని గానీ, ఇతర పప్పుధాన్యాన్ని గానీ ఓ పట్టుపడుతాయి. ఆహార పదార్థాలను లాక్కెళ్లి మరీ తింటాయి. అలాగే.. పుస్తకాలు,పేపర్, ఇతర ఫైళ్లలను ధ్వంసం చేస్తాయి. ఈ విధ్వంసం భరించలేక.. బోన్లలను గానీ, ఉచ్చులు, రాట్ కిల్ కేక్, ఎలుకల కాళ్లకు అతుక్కునే కేక్ వాటిని తెచ్చి.. ఇంట్లో పెడుతుంటాం.
మరికొందరు పిల్లులను కూడా పెంచుతుంటారు. ఈ కోవకు చెందిన ఓ వింత ఘటన వైరల్ అవుతుంది.
వివరాల్లోకెళ్తే.. బెంగళూరు నగరానికి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌరిబిదనూర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎలుకలు బీభత్సం సృష్టించాయి. నానా రచ్చ చేశాయి. ముఖ్యమైన ఫైళ్లను, పేపర్లను ఎలుకలు ధ్వంసం చేయడం ప్రారంభించాయి. రోజురోజుకు ఎలుకల బెడద తీవ్రమైంది. ఈ సమస్య తీవ్రం కావడంతో పరిష్కరించడానికి పిల్లులను ఉపయోగించాల్సి వచ్చిందని పోలీసు స్టేషన్ వర్గాలు తెలిపాయి.
గౌరిబిదనూర్ రూరల్ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసు స్టేషన్ సమీపంలో ఓ సరస్సు ఉన్నందున ఎలుకల బెడద తీవ్రంగా ఉన్నట్టు గుర్తించామనీ, తొలుత రాట్ కిల్లింగ్ పరికరాలను ఉపయోగించమనీ, వాటితో అంతగా ఫలితం లేకపోవడంతో ..పోలీసు స్టేషన్‌లో పిల్లిని పెంచుతున్నమని తెలిపారు. దీంతో ఎలుకల సంఖ్య తగ్గిందని తెలిపారు. పిల్లులకు తాము.. ప్రత్యేకంగా చూసుకుంటున్నామని తెలిపారు. దాని కోసం పాలు, ఆహారం పెడుతున్నామని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా కర్నాటక రాష్ట్రంలోని అనేక విభాగాలు ఎలుకలు, దోమల బెడదను అరికట్టడానికి బడ్జెట్ నుంచి కొంత మొత్తాన్ని గతంలో కేటాయించినట్లు సమాచారం. ఎలుకలు ,దోమల బెడదను ఎదుర్కోవడానికి కర్ణాటక ఎగ్జామినేషన్స్ అథారిటీ (కెఇఎ) సంవత్సరానికి సుమారు రూ. 50,000 ఖర్చు చేస్తుందని ఇటీవల సమాచార హక్కు (ఆర్‌టిఐ) ప్రశ్న వెల్లడించింది. 2010-15 మధ్య ఎలుకలను పట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 19.34 లక్షలు ఖర్చు చేసిందని ప్రత్యేక ఆర్టీఐ ప్రశ్న ద్వారా వెల్లడైంది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లలో పిల్లుల కొలువుల ఘటన అందరినీ అవ్వాక్కు అయ్యేలా చేస్తుంది.
