మనీల్యాండరింగ్ కేసులో అరెస్టయిన కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్‌కు ఢిల్లీ ట్రయల్ కోర్టు 10 రోజుల కస్టడీ విధించింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఆగస్టు 30 నుంచి విచారణ జరుగుతోంది.

కేసులో మరింత లోతైన దర్యాప్తు నిమిత్తం ఆయనను మంగళవారం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో డీకేను 14 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చేసిన విజ్ఞప్తిని ట్రయల్ కోర్టు తోసిపుచ్చింది.

ఆయనను కేవలం 10 రోజులు మాత్రం కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతిస్తామని స్పష్టం చేసింది. మంగళవారం అరెస్టయిన దగ్గరి నుంచి ఛాతి నొప్పితో పాటు షుగర్, బీపీ లెవల్స్ పడిపోవడంతో శివకుమార్‌ను బెంగళూరులోని ఆర్ఎల్ఎం ఆసుపత్రికి తరలించారు.

అక్కడ వైద్య పరీక్షల అనంతరం ఆయనను నేరుగా కోర్టుకు తరలించారు. మరోవైపు శివకుమార్ అరెస్ట్‌ను నిరసిస్తూ కాంగ్రెస్ ఇచ్చిన కర్ణాటక బంద్ పిలుపు హింసాత్మకంగా మారింది. పలు చోట్ల ఆందోళనకారులు బస్సు అద్దాలను ధ్వంసం చేయడంతో పాటు పాఠశాలలు, కళాశాలలను బలవంతంగా మూసివేయించారు. 

నా అరెస్ట్‌తో బీజేపీ మిషన్ పూర్తయ్యింది... బాధితుడిగా మిగిలా: డీకే శివకుమార్

కాంగ్రెస్‌కు షాక్: మనీల్యాండరింగ్‌ కేసులో డీకే శివకుమార్ అరెస్ట్