కర్ణాటకలో రాజకీయ సంక్షోభం మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్షకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూర్ప స్పందించారు.

కుమారస్వామి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమిలోని 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని.. ఇద్దరు స్వతంత్రులు కూడా తమ మద్ధతును ఉపసంహరించుకున్నారని యడ్డీ గుర్తు చేశారు.

కాగా శుక్రవారం జరిగిన బీఏసీ సమావేశంలో విశ్వాస పరీక్షను బుధవారం నిర్వహంచాల్సిందిగా కుమారస్వామి కోరారు. అయితే బలపరీక్షను సోమవారమే నిర్వహించాల్సిందిగా కోరుతున్నారు.