బాగా ఆనందంగా ఉన్నప్పుడు ప్రతి మనిషికీ మాటలు తడబడుతుంటాయి. కర్ణాటక మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ఓ మంత్రిగారికి అచ్చం ఇలాంటి పరిస్ధితే ఎదురైంది. ముఖ్యమంత్రి యడియూరప్ప 17 మందితో తన కేబినెట్‌ను మంగళవారం విస్తరించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో మధుస్వామి మంత్రిగా ప్రమాణం చేస్తుండగా ఓ సరదా సన్నివేశం జరిగింది. మంత్రిగా అనే పదానికి బదులు.. ముఖ్యమంత్రి అనేయడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

అక్కడేవున్న సీఎం యడియూరప్ప నవ్వుతూ.. మధుస్వామిని ఆలింగనం చేసుకున్నారు. మరోవైపు మంత్రులుగా పనిచేసిన వారిలో ఎక్కువమంది గతంలో యడియూరప్ప ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారే.. వీరిలో మెజార్టీ భాగం లింగాయత్ వర్గానికి చెందినవారే కావడం మరో విశేషం.