ఈనెల 4వ తేదీన ఆయన ఆరోగ్యం క్షీణించడంతో లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చేర్చారు. అప్పటినుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. 

ఉత్తరప్రదేశ్ మజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ (89) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కల్యాణ్ సింగ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాదపడుతున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈనెల 4వ తేదీన ఆయన ఆరోగ్యం క్షీణించడంతో లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చేర్చారు. అప్పటినుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల భాజాపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. 

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కల్యాణ్ సింగ్.. బీజేపీ హయాంలో ఉత్తరప్రదేశ్ కు రెండు సార్టు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 2014 నుంచి 2019వరకు రాజస్థాన్ గవర్నర్ గానూ పనిచేశారు.