Asianet News TeluguAsianet News Telugu

justiceforloviassumi : అమ్మాయి దుస్తులు చింపేసి, శారీరకంగా హింసించి..వీడియోతీసి...!!

ఐదుగురు రాక్షసులు ఓ అమ్మాయి దుస్తులు చింపేసి, శారీరకంగా హింసించారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ హింసించిన వారిలో ఒక మహిళ కూడా ఉంది. ఈ దారుణమైన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. అంతేకాదు ఇందులో ఉంది నాగాలాండ్ కు చెంది లోవీ అస్సుమీ అని.. ఆమెను న్యాయం జరగాలని ఉద్యమం మొదలయ్యింది. దీనికోసం ఏర్పాటైన #justiceforloviassumi అనే హ్యాష్ ట్యాగ్  ట్విట్టర్ ను కుదిపేస్తోంది. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది.. 

justice for lovi assumi actual facts in molestation video - bsb
Author
Hyderabad, First Published May 27, 2021, 11:39 AM IST

ఐదుగురు రాక్షసులు ఓ అమ్మాయి దుస్తులు చింపేసి, శారీరకంగా హింసించారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ హింసించిన వారిలో ఒక మహిళ కూడా ఉంది. ఈ దారుణమైన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. అంతేకాదు ఇందులో ఉంది నాగాలాండ్ కు చెంది లోవీ అస్సుమీ అని.. ఆమెను న్యాయం జరగాలని ఉద్యమం మొదలయ్యింది. దీనికోసం ఏర్పాటైన #justiceforloviassumi అనే హ్యాష్ ట్యాగ్  ట్విట్టర్ ను కుదిపేస్తోంది. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది.. 

25ఏళ్ల లోవీ అస్సుమీ ఆత్మహత్య ఉదంతం ఇప్పుడు ఉత్తర భారతాన్ని కుదిపేస్తుంది. నాగాలాండ్​కు చెందిన లోవి.. జోధ్​పూర్​లో ఓ రెస్టారెంట్ లో పని చేస్తుంది. మే 23న తాను ఉంటున్న గదిలో ఆమె ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ లోపు ఇంటర్నెట్లో ఒక వీడియో రిలీజ్ అయింది. నలుగురు వ్యక్తులు, ఓ మహిళా కలిసి ఓ అమ్మాయిని దుస్తులు చించేసి శారీరకంగా హింసించిన వీడియో అది. ఆ వీడియోను ఇంటర్నెట్లో ఉంచారు.

అయితే  కొందరు ఉరికి వేలాడుతున్న లోవీ అస్సుమీ ఫోటోలను, వీడియోలను అందులోని స్క్రీన్ షాట్ ను షేర్ చేశారు. ఆ వీడియోలో ఉంది లోవీ అస్సుమీ అని, అవమానం తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుందని ప్రచారం మొదలయ్యింది. దీంతో ఆమెకు న్యాయం జరగాలని సోషల్ మీడియా ఉద్యమిస్తోంది. 

అయితే నాగాలాండ్ యువతి సూసైడ్ కి, ఆ వీడియో లకు సంబంధం లేదని తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ అడిషనల్ డిజిపి రాబిన్​ హిబు కార్యాలయం నుంచి ఒక స్టేట్మెంట్ రిలీజ్ అయింది. అవి రెండూ వేర్వేరు ఘటనలని, ఈ మేరకు జోధ్​పూర్​ డీజీపీతో సంప్రదించి ధ్రువీకరించి నట్లు చెప్పారు. అంతేకాదు వీడియోలను నాగాలాండ్ యువతి సూసైడ్ కు ముడిపెట్టి, వైరల్ చేసిన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు.. ఈ మేరకు దర్యాప్తు జరపాలని గుజరాత్, మిజోరాం, రాజస్థాన్ పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈ సమాచారంతో కొందరు యూట్యూబర్లు ఈ వైరల్ వీడియో పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 

అయితే ఘటన లో ఉన్న బాధితురాలు ఎవరైనా సరే నిందితులను శిక్షించాల్సిందేనని కొందరు డిమాండ్ చేశారు. ఈ మేరకు అస్సాం పోలీసులు ఫేస్బుక్లో ఒక ప్రకటన చేశారు. వీరిలో ఐదుగురు ఉన్నారని.. వాళ్ల ఆచూకీ చెబితే నజరానా అందిస్తామని తెలిపింది. ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలీదు. కాని నిందితుల సమాచారం అందిస్తే బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని అస్సాం పోలీసులు వెల్లడించారు. అయితే ఈ వీడియోలో ఆ గ్యాంగ్​ ఇద్దరు అమ్మాయిలపై దాష్టీకానికి పాల్పడినట్లు గుర్తించామని కొందరు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios