Asianet News TeluguAsianet News Telugu

వివాదాస్పద తీర్పుల న్యాయమూర్తి పుష్ఫ గనేడివాలాకు కేంద్రం మరో షాక్...

చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల కేసుల్లో వివాదాస్పద తీర్పులిచ్చిన బాంబే హైకోర్టు అడిషనల్ జడ్జ్ పుష్ఫ గనేడివాలాకి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. అడిషనల్ జడ్జ్ గా ఆమె పదవీకాలాన్ని రెండేళ్లకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసును తోసి పుచ్చింది. ఆమె పదవీకాలాన్ని ఒక సంవత్సరానికి పరిమితం చేసింది. 

Judge who gave groping without skin to skin not sexual assault verdict, faces Centre s ire - bsb
Author
Hyderabad, First Published Feb 13, 2021, 11:45 AM IST

చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల కేసుల్లో వివాదాస్పద తీర్పులిచ్చిన బాంబే హైకోర్టు అడిషనల్ జడ్జ్ పుష్ఫ గనేడివాలాకి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. అడిషనల్ జడ్జ్ గా ఆమె పదవీకాలాన్ని రెండేళ్లకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసును తోసి పుచ్చింది. ఆమె పదవీకాలాన్ని ఒక సంవత్సరానికి పరిమితం చేసింది. 

అడిషనల్ జడ్జ్ గా పుష్ఫ గనేడివాలా పదవీకాలం శుక్రవారానికి ముగిసింది. ఫిబ్రవరి 13, శనివారం నుంచి ఆమె కొత్త పదవీకాలం ప్రారంభవుతుంది. అయితే ఆమె సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసినట్టుగా రెండేళ్ల కాలపరిమితిని ఇవ్వకూడదని కేంద్రం నిర్ణయించింది.

ఈ మేరకు ఆమెకు పదవీకాలాన్ని సంవత్సరానికి కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతకుముందు జస్టిస్ గనేడివాలాను పర్మినెంట్ జడ్జ్ గా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొల్లీజియం జనవరి 20న చేసిన సిఫారసులను కూడా కేంద్రం ఇప్పటికే తిరస్కరించిన విషయం తెలిసిందే.  

అయితే పర్మినెంట్ జడ్జ్ గా ప్రమోట్ అయ్యేముందు సాధారణంగా అడిషనల్ జడ్జ్ లుగా రెండు సంవత్సరాల పాటు పనిచేయాల్సి ఉంటుంది. 

పోస్కో యాక్ట్ కింద ఇచ్చిన రెండు వేరు వేరు తీర్పులతో దేశవ్యాప్తంగా సంచలనానికి తెరతీశారు పుష్ప గనేడివాలా. 12యేళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులో చర్మానికి, చర్మం తాకకుండా బట్టలపైనుండి వక్షోజాలను తాకితే అత్యాచారంగా పోస్కో లో పేర్కోలేదని తీర్పు ఇచ్చారు. దీని మీద దేశవ్యాప్తంగా ఆందోళన రేగింది. 

అదే సమయంలో  ఐదేళ్ల బాలికపై లైంగిక వేధింపుల మరో కేసులో ఇలాంటి వివాదాస్పద తీర్పే ఇచ్చారు. బాలిక చేతులు పట్టుకోవడం, ఆమె ముందు ప్యాంట్ జిప్ తీయడం పోక్సో చట్టం ప్రకారం లైంగిక వేధింపుల కిందికి రాదని, సదరు దోషిని నిర్దోషిగా ప్రకటించారు. 

దీంతో దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యింది.  దీంతో అలర్ట్ అయిన అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ ఈ ఉత్తర్వులపై స్పందించారు. ఇవి ప్రమాదకరమైన ప్రభావాలకు దారి తీసేలా ఉన్నాయని పేర్కొనడంతో ఆ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించిన బాంబే హైకోర్టు ఉత్తర్వుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios