JNU Vice-Chancellor: ప్రస్తుతం సావిత్రిబాయి ఫూలే యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌గా ఉన్న శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌ను జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ వీసీగా నియమించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
JNU Vice-Chancellor: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) తొలిసారి మహిళా వైస్‌ఛాన్సలర్ (వీసీ) నియమితులయ్యారు. జేఎన్‌యూ నూతన వీసీగా సావిత్రీబాయి ఫూలే పూణే యూనివర్సిటీ ప్రొఫెసర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ నియమితులైనట్లు విద్యా మంత్రిత్వ శాఖను తెలిపింది. ఆమె పదవి కాలం ఐదేండ్లు ఉంటుందనీ విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది
శాంతిశ్రీ ధూళిపూడి పండిట్.. సావిత్రీబాయి ఫూలే పూణె విశ్వవిద్యాలయంలో పొలిటికల్& పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
ప్రొఫెసర్ పండిట్ JNU నుండే ఆమె ఎంఫిల్ , PhD డిగ్రీలను పొందారు. 1988లో ఆమె గోవా విశ్వవిద్యాలయంలో అధ్యాపక వృత్తిని ప్రారంభించారు. ఆ తరువాత ఆమె 1993లో పూణే యూనివర్సిటీలో చేరారు. జేఎన్‌యూ కొత్త వైస్‌ఛాన్సలర్‌గా నియమితులైన ప్రొఫెసర్ పండిట్‌ను అభినందించారు.
గతేండ్లుగా జేఎన్‌యూ VC గా వ్యవహరించిన ఎం. జగదీష్ కుమార్ పదవీకాలం తరువాత.. ఆయన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఛైర్మన్ గా నియమితులయ్యారు. JNU వైస్-ఛాన్సలర్‌గా తొలిసారి మహిళవైస్-ఛాన్సలర్ ను నియమించడం విశేషం. ఆ గౌరవం శాంతిశ్రీ పండిట్ కు దక్కింది.
