Asianet News TeluguAsianet News Telugu

జ‌మ్మూ కాశ్మీర్ జైళ్ల శాఖ డీజీ హేమంత్ కే లోహియా దారుణ హ‌త్య‌..

జమ్మూ కాశ్మీర్ లో జైళ్ల శాఖ డీజీగా పని చేస్తున్న సీనియర్ పోలీసు అధికారి హేమంత్ కె లోహియా దారుణంగా హత్యకు గురయ్యారు. అయితే ఈ ఘటనకు ఓ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించింది. అయితే ఇందులో ఇంటి పని మనిషి ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Jammu and Kashmir DG Hemant K Lohia brutal murder
Author
First Published Oct 4, 2022, 8:02 AM IST

జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ (జైళ్లు) హేమంత్ కె లోహియా జమ్మూలోని తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వ‌చ్చింది. అయితే ఈ హ‌త్య‌లో ఇంటి మ‌నిషిని ప్ర‌ధాన నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు.

పొట్టలో రూ.9 కోట్ల విలువైన కొకైన్‌.. వీడొక్కడే సినిమా చూపించిన స్మగ్లర్.. స్కాన్ చేసి షాకైన పోలీసులు

డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దిల్‌బాగ్ సింగ్ దీనిని ‘‘అత్యంత దురదృష్టకర’’ సంఘటనగా అభివర్ణించారు. పరారీలో ఉన్న ఇంటి ప‌ని మనిషి అయిన జాసిర్‌గా గుర్తించి, అత‌డి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. 

భార‌త జలాల్లోకి అక్ర‌మంగా చొర‌బ‌డ్డ పాక్ బోట్‌.. సీజ్ చేసిన బీఎస్‌ఎఫ్..

57 ఏళ్ల హేమంత్ కే లోహియా ఆగస్ట్‌లో కేంద్ర పాలిత ప్రాంతంలో జైళ్ల డైరెక్టర్ జనరల్‌గా పదోన్నతి పొందారు. కాగా.. నిందితుడు ఆయ‌న మృత‌దేహానికి నిప్పు పెట్టేందుకు కూడా ప్ర‌య‌త్నించాడు. అయితే ఈ హత్యకు 'పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫోర్స్' అనే ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత వహించింది. కానీ ఇందులో ఉగ్ర శక్తుల ప్రమేయాన్ని పోలీసులు ఇప్పటి వరకు ప్రస్తావించలేదు.

ప్రకటనల ప్ర‌సారంపై కేంద్రం మార్గదర్శకాలు.. ఇక‌పై ఆ యాడ్స్ ప్ర‌సారం చేస్తే.. అంతే..

జమ్మూ శివార్లలోని ఉదయవాలా వద్ద ఉన్న జైళ్ల శాఖ డీజీ ఇంటిని సందర్శించిన జమ్మూ జోన్ అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ ముఖేష్ సింగ్ మాట్లాడుతూ.. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి లోహియా.. శరీరంపై కాలిన గాయాలు, గొంతు కోసిన గాయాలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. హంతకుడు మొదట లోహియాను ఊపిరాడకుండా చేసి చంపాడని, అలాగే విరిగిన కెచప్ బాటిల్‌ని ఉపయోగించి అతని గొంతు కోసి, తర్వాత శరీరానికి నిప్పంటించే ప్రయత్నం చేశాడని పోలీసు చీఫ్ చెప్పారు.

భార‌త జలాల్లోకి అక్ర‌మంగా చొర‌బ‌డ్డ పాక్ బోట్‌.. సీజ్ చేసిన బీఎస్‌ఎఫ్..

అయితే మృతుడి నివాసం వద్ద విధుల్లో ఉన్న గార్డులు లోహియా గ‌దిలో మంట‌లు రావ‌డాన్ని గ‌మ‌నించారు. ఇంట్లోకి వెళ్లాల‌ని ప్ర‌య‌త్నించ‌గా.. తాళం వేసి క‌నిపించింది. దీంతో గార్డులు త‌లుపులు ప‌గ‌లగొట్టి లోప‌లికి ప్ర‌వేశించారు. ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలిస్తే ఇది క‌చ్చితంగా హ‌త్యే అని ఏడీజీపీ తెలిపారు. ఇంట్లో ప‌ని చేసే వ్య‌క్తి ప‌రారీలో ఉన్నాడ‌ని, అత‌డి కోసం అన్వేష‌ణ ప్రారంభ‌మైంద‌ని పేర్కొన్నారు. ఫోరెన్సిక్, క్రైమ్ బృందాలు ఆధారాలు సేక‌రిస్తున్నాయ‌ని తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌పై విచారణ ప్రారంభ‌మైంద‌ని, సీనియ‌ర్ అధికారులు అంద‌రూ అక్క‌డే ఉన్నార‌ని ఆయ‌న తెలిపారు. జ‌మ్మూ కాశ్మీర్ పోలీసు కుటుంబం డీజీ మ‌ర‌ణం ప‌ట్ల తీవ్ర విచారం వ్య‌క్తం చేస్తోంద‌ని చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios