కేంద్ర ఐటీ మంత్రిగా అశ్వనీ వైష్ణవ్ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. రావడం రావడమే ట్విటర్ కు వార్నింగ్ ఇచ్చారు. భారత భూభాగంమీద రూపొందించిన చట్టాలే అత్యంత ఉన్నతమైనవవి, కచ్చితంగా వాటిని పాటించాల్సిందేనని ట్విటర్ కు తేల్చి చెప్పారు. 

బుధవారం ప్రమాణస్వీకారం చేసిన కొత్త కేంద్ర మంత్రులు ఇవ్వాళ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే కేంద్ర ఐటీ మంత్రిగా రవి శంకర్ ప్రసాద్ స్థానంలో అశ్వినీ వైష్ణవ్ ప్రమాణ స్వీకారం చేశారు. 

కేంద్ర ఐటీ మంత్రిగా అశ్వనీ వైష్ణవ్ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. రావడం రావడమే ట్విటర్ కు వార్నింగ్ ఇచ్చారు. భారత భూభాగంమీద రూపొందించిన చట్టాలే అత్యంత ఉన్నతమైనవవి, కచ్చితంగా వాటిని పాటించాల్సిందేనని ట్విటర్ కు తేల్చి చెప్పారు. 

కొన్ని రోజుల నుంచి రూల్స్ విషయంలో ట్విటర్ కు, భారత ప్రభుత్వానికి మాటల యుద్ధం నడుస్తున్న విసయం తెలిసిందే. రూల్స్ కచ్చితంగా పాటించాల్సిందేనని మొన్నటి వరకూ ఐటీ శాఖ బాధ్యతలు చూసుకున్న రవి శంకర్ ప్రసాద్ కూడా ట్విటర్ ను మందలించిన విషయం తెలిసిందే. 

కాగా ,బుధవారం కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగింది. కొత్త, పాత కలయికతో పాటు సీనియర్లు, జూనియర్లకు సమ ప్రాధాన్యం ఇస్తూ ప్రధాని నరేంద్రమోడీ తన కేబినెట్‌ను పునర్ వ్యవస్ధీకరించారు. మొత్తం 43 మందితో కూడిన మంత్రుల జాబితాను మీడియాకు విడుదల చేశాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. 

కేబినెట్ మంత్రులు: 

నారాయణ్ రాణే: (బీజేపీ) - మహారాష్ట్ర
శర్వానంద సోనోవాట్ : (బీజేపీ) - అసోం
డా.వీరేంద్రకుమార్ : (బీజేపీ) - మధ్యప్రదేశ్
జ్యోతిరాదిత్య సింధియా : (బీజేపీ) - మధ్యప్రదేశ్
రాంచంద్ర ప్రసాద్ సింగ్: (జేడీయూ) - బీహార్
అశ్వినీ వైష్ణవ్: (బీజేపీ) - ఒడిశా
పశుపతి కుమార్ పరాస్ : లోక్‌జన శక్తి (బీహార్)
కిరణ్ రిజిజు: (బీజేపీ) - అరుణాచల్ ప్రదేశ్
రాజ్‌కుమార్ సింగ్ : బీజేపీ (బీహార్)
హర్దీప్ సింగ్ పూరి : బీజేపీ (ఢిల్లీ)
మన్‌సుఖ్ మాండవీయ: బీజేపీ (గుజరాత్)
భూపేంద్ర యాదవ్ : బీజేపీ (రాజస్థాన్)
పురుషోత్తం రూపాలా: బీజేపీ (గుజరాత్)
కిషన్ రెడ్డి : బీజేపీ (తెలంగాణ)
అనురాగ్ సింగ్ ఠాకూర్ : బీజేపీ (హిమాచల్ ప్రదేశ్)
పంకజ్ చౌధరీ : బీజేపీ (ఉత్తరప్రదేశ్)
అనుప్రియా సింగ్ పటేల్ : అప్నాదళ్ (ఉత్తరప్రదేశ్)
డా.సత్యపాల్ సింగ్ భగేల్: బీజేపీ (ఉత్తరప్రదేశ్)
రాజీవ్ చంద్రశేఖర్: బీజేపీ (కర్ణాటక)
శోభా కరంద్లాజే: బీజేపీ (కర్ణాటక)

కేంద్ర మంత్రిగా తెలుగు ఎంపీ కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి గెలుపొందిన ఆయన.. మోడీ కేబినెట్‌లో హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల కాలంలో తన పనితీరు, ప్రతిభతో మోడీని ఆకట్టుకున్నారు. తాజాగా మంత్రి వర్గం విస్తరణలో ఆయన కేబినెట్ ర్యాంక్‌ను పొందారు. 

43 మందితో జరిపిన కేబినెట్ విస్తరణలో రాజీవ్ చంద్రశేఖర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. రాజ్య సభ ఎంపీగా కొనసాగుతున్న రాజీవ్ చంద్రశేఖర్ రాజకీయాల్లోకి వచ్చేముందు భారతదేశంలో మొబైల్ విప్లవానికి తొలి అడుగులు వేసిన అతి కొద్ది మందిలో ఒకరు.