Chandrayaan-3: రోవర్, ల్యాండర్ లు యాక్టివ్ గా మారుతాయా? ఇస్రో చీఫ్ సోమనాథ్ ఏమన్నారంటే..
Chandrayaan-3: చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత, అందరి దృష్టి విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌పై పడింది. ఈ తరుణంలో గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చీఫ్ ఎస్ సోమనాథ్.. చంద్రయాన్ ప్రయోగంపై కీలక ప్రకటన చేశారు.

Chandrayaan-3: చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ తర్వాత.. అందరి దృష్టి విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌పై పడింది. చంద్రునిపై రాత్రికి ముందు విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను స్లీప్ మోడ్‌లో ఉండిపోయాయి. అక్కడ పగలు కాగానే, రెండూ మళ్లీ చురుకుగా మారతాయని అంచనా వేశారు.
అయితే.. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ఎప్పుడు మేల్కొంటాయి? అవి యాక్టివ్ గా మారుతాయా? లేదా ల్యాండర్, రోవర్ కథ ముగిసినట్టేనా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రతి మదిలో ఉన్నాయి. అయితే.. ఈ ప్రశ్నలపై ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్ కీలక ప్రకటన చేశారు.
ప్రజ్ఞాన్ రోవర్ అనుకున్న పనిని పూర్తి చేసిందని, కానీ స్లీప్ మోడ్ లో ఉన్న రోవర్, ల్యాండర్లు తిరిగి యాక్టివ్ చేయలేకపోయారు. ప్రస్తుతం సిగ్నల్ అందలేదని, అయినా ఎటువంటి సమస్య లేదని ఇస్రో చీఫ్ తెలిపారు.
గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఇస్రో చీఫ్ సోమనాథ్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నవంబర్ లేదా డిసెంబర్‌లో జరిగే ఎక్స్‌రే పొలారిమీటర్ శాటిలైట్ ప్రయోగానికి నేషనల్ స్పేస్ ఏజెన్సీ సన్నాహాలు చేస్తోందని చెప్పారు. చంద్రునిపై స్లీప్ మోడ్ లో ఉన్న ప్రజ్ఞాన్ పరిస్థితి గురించి ఇస్రో చీఫ్ మాట్లాడుతూ.. చంద్రునిపై ఉష్ణోగ్రత సున్నా కంటే 200 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయిందని, దాని ఎలక్ట్రానిక్ సర్క్యూట్‌లు దెబ్బతినకపోతే నిద్ర నుండి మేల్కొంటుందని చెప్పారు.
ప్రస్తుతం విక్రమ్, ప్రజ్ఞాన్‌ల నుంచి ఎలాంటి సిగ్నల్ అందలేదని తెలిపారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఉదయం ప్రారంభమైనందున ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్‌తో ఈ నెల ప్రారంభంలో వారి స్థితిని తెలుసుకోవడానికి వారితో కమ్యూనికేషన్‌ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేశామని ఇస్రో గత వారం తెలిపింది. అయితే.. ఎటువంటి స్పందన రాలేదు. సిగ్నల్ అందలేదని తెలిపారు. చంద్రునిపై రాత్రి పడకముందే.. ల్యాండర్, రోవర్ రెండింటినీ మోడ్‌లో పెట్టిన విషయం తెలిసిందే.