పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకునే దిశగా సాగుతుంది. ఇప్పటివరకు వెలువడిని ఫలితాలను చూస్తే.. ఆప్ భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతుంది. పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూనే కాంగ్రెస్ కొంప ముంచాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకునే దిశగా సాగుతుంది. ఇప్పటివరకు వెలువడిని ఫలితాలను చూస్తే.. ఆప్ భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతుంది. తాజా ట్రెండ్స్ చూస్తే.. పంజాబ్‌లో 2017 ఎన్నికల్లో 20 సీట్లను గెలుచుకున్న ఆప్.. ఇప్పుడు 80 వరకు స్థానాలు సొంతం చేసుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కిందటిసారి 77 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్.. ఈసారి 20 సీట్లలోపే పరిమితం అయ్యే సంకేతాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన పలువురు కీలక నేతలు సైతం ఓటమి దిశగా సాగుతున్నారు. అయితే కాంగ్రెస్ ఘోర పరాభవం దిశగా సాగడానికి ఆ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలే కారణంగా కనిపిస్తుంది.
ముఖ్యంగా పంజాబ్ పీసీసీ చీఫ్‌గా ఉన్న నవజ్యోత్ సింగ్ సిద్దూ.. కాంగ్రెస్ పార్టీ కొంపముంచినట్టుగా కనిపిస్తోంది. 2017లో పంజాబ్ పీసీసీ చీఫ్‌గా ఉన్న అమరీందర్ సింగ్.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. అయితే బీజేపీ నుంచి ఎంపీగా ఉన్న సిద్దూ 2016లో ఆ పార్టీకి రాజీనామా చేశారు. 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే కాంగ్రెస్‌లో చేరిన సిద్దూ.. క్రమంగా తనకంటూ ఓ వర్గాన్ని క్రియేట్ చేసుకన్నారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
అయితే అధికారంలో ఉన్న సొంత పార్టీపైనే సిద్దూ తరచూ విమర్శలు చేయడం.. ఎప్పుడూ చర్చనీయాంశంగా మారేది. అప్పటి కాంగ్రెస్ సీఎం అమరీందర్ సింగ్‌ను లక్ష్యంగా చేసుకుని సిద్దూ తీవ్ర విమర్శలు చేసేవాడు. పార్టీలో తన వర్గం నేతలతో కూడా ఇదే రకమైన విమర్శలు చేయించేవాడు. ఇక, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సిద్దూ మరింత దూకుడుగా అమరీందర్ సింగ్‌ను టార్గెట్ చేసుకన్నాడు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూనే.. అదే పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు కారణమయ్యాడు.
ఈ క్రమంలోనే అమరీందర్ సింగ్ సీఎం పదవి పోవడం.. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడటం జరిగిపోయింది. అయితే సీఎంగా అమరీందర్ సింగ్ తొలగింపు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని మాటలు చెప్పినప్పటికీ.. సిద్దూనే అసలు కారణమనే ప్రచారం ఉంది. సిద్దూ మాటలు నమ్మే కాంగ్రెస్ అధిష్టానం.. అమరీందర్ సింగ్‌ను తొలగించినట్టుగా చెప్తారు. అయితే సిద్దూ సీఎం పదవిని ఆశించినట్టుగా కూడా కాంగ్రెస్ అధిష్టానానికి బలమైన సంకేతాలే పంపారు. కానీ కాంగ్రెస్ అనుహ్యంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని సీఎం కూర్చీలో కూర్చొపెట్టింది.
అయితే దీనిని కూడా సిద్దూ, అతని వర్గం జీర్ణించుకోలేపోయింది. చన్నీ సీఎంగా ఉన్న సిద్దూ, ఆయన మద్దతుదారులు పట్టించుకునే వారు కాదు. చన్నీపై కొన్ని సందర్భాల్లో బహిరంగంగానే అక్కసు వెళ్లగక్కారు. ఇక, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గెలిస్తే సిద్దూనే సీఎం ప్రచారం కూడా తన వర్గం చేత చేయించారు. చన్నీ తాత్కాలిక సీఎం వంటి కామెంట్స్ కూడా చేశారు. మరోవైపు సీఎం పోస్టుపై ఆశపెట్టుకున్న.. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలంటూ కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానం సీఎం అభ్యర్థిగా చన్నీని ప్రకటించడం.. సిద్దూలో మరింతగా అసంతృప్తికి కారణమైంది. అయితే పైకి ఏమిలేదని ప్రకటించినా.. లోపల మాత్రం సిద్దూ తీవ్ర అసహనంతో ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు సీఎం పదవి నుంచి తొలగించడంతో.. కాంగ్రెస్‌ను వీడిన అమరీందర్ సింగ్ సొంత పార్టీ పెట్టి బీజేపీతో జట్టు కట్టారు. బీజేపీతో కూటమిగా బరిలో దిగారు. ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్‌పై ప్రభావం చూపాయి. ఇలా.. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలకు కారణమైన సిద్దూ.. బయటకు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మకుండా చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న పరిణామాలు ఆ పార్టీ ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయాయని స్పష్టం అవుతుంది. ఈ విధంగా తన వ్యవహార శైలితో సిద్దూ.. పంజాబ్‌లో కాంగ్రెస్ కొంప ముంచాడు.
మరోవైపు పంజాబ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించిన కేజ్రీవాల్.. విజయం దిశగా దూసుకుపోతున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేసిన సమయంలో కేజ్రీవాల్ వారికి మద్దతు తెలుపడం.. ఆయనపై రైతు మంచి అభిప్రాయం కలిగేలా చేసిందనే చెప్పవచు. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపిన రైతులకు కేజ్రీవాల్ ప్రభుత్వం మద్దతు తెలిపింది. రైతులకు అవసరమైన ఆహారం, నీరు వంటి సకల సౌకర్యలు సమకూర్చిన సంగతి తెలిసిందే.
