Asianet News TeluguAsianet News Telugu

నుస్రత్ జహాన్ పెళ్లి అయిపోయిందా..? ఫోటోతో హింట్ ఇచ్చిన ఎంపీ..!

తాజాగా యశ్ గుప్తాతో తన పెళ్లి అయిపోయిందని అర్థం వచ్చేలా ఆమె పోస్టు పెట్టడం గమనార్హం. విజయదశమి సందర్భంగా.. ఆమె పెట్టిన పోస్టుతో నుస్రత్ కి పెళ్లి అయిపోయిందని విషయం స్పష్టంగా అర్థమౌతోంది.

Is Nusrat Jahan married to Yash Dasgupta? TMC MP wears Shakha Pola bangles in THIS viral post
Author
Hyderabad, First Published Oct 16, 2021, 2:37 PM IST

టీఎంసీ ఎంపీ, బెంగాలీ సినీ నటి నుస్రత్ జహాన్.. గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆమె పెళ్లి, ప్రెగ్నెన్సీ వార్తలు తీవ్ర దుమారం రేపాయి. తన పెళ్లి చెల్లదంటూ ఆమె ప్రకటించిన కొద్ది రోజులకే.. ఆమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వచ్చాయి. అయితే.. ఆ ప్రెగ్నెన్సీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆమె మాజీ భర్త ప్రకటించడం తీవ్ర దుమారం రేపింది. నిజంగానే ఆమె గర్భం దాల్చడం.. బిడ్డకు జన్మనివ్వడం కూడా జరిగాయి. అయితే.. ఆ బిడ్డకు తండ్రి ఎవరూ అని ఆమె వెంటనే ప్రకటించలేదు. తన బిడ్డ తండ్రికి ఆ విషయం తెలుసంటూ పేర్కొంది. ఇటీవల ఓ కేకు పై తన బిడ్డకు తండ్రి నటుడు యశ్ అంటూ ఇన్ డైరెక్ట్ గా చెప్పింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nusrat (@nusratchirps)

అయితే.. తాజాగా యశ్ గుప్తాతో తన పెళ్లి అయిపోయిందని అర్థం వచ్చేలా ఆమె పోస్టు పెట్టడం గమనార్హం. విజయదశమి సందర్భంగా.. ఆమె పెట్టిన పోస్టుతో నుస్రత్ కి పెళ్లి అయిపోయిందని విషయం స్పష్టంగా అర్థమౌతోంది.

Is Nusrat Jahan married to Yash Dasgupta? TMC MP wears Shakha Pola bangles in THIS viral post

ఇంతకీ మ్యాటరేంటంటే.. దసరా పండగ రోజున.. నుస్రత్.. తెలుపు, ఎరుపు రంగు కాబంబినేషన్ లో ఉన్న చీరను కట్టుకోని ఉన్న ఫోటోని పోస్టు చేశారు. అయితే.. ఆ ఫోటోలో ఆమె తెలుపు, ఎరుపు రంగుకాంబినేషన్ లో ఉన్న గాజులు ధరదించారు వాటిని శఖాపూల గాజులు అని పిలుస్తారు. ఈ సంప్రదాయ గాజులను బెంగాలీలో పెళ్లైన మహిళలు మాత్రమే ధరిస్తారు.

Is Nusrat Jahan married to Yash Dasgupta? TMC MP wears Shakha Pola bangles in THIS viral post

ఆ ఫోటోలో నుస్రత్ ఆ గాజులు ధరించి ఉండటం విశేషం. దీంతో.. యశ్ తో నుస్రత్ కి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందనే క్లారిటీ వచ్చేసింది. దీంతో.. అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఇటీవల నుస్రత్.. పండగ సందర్భంగా ఫోటో షూట్ ని కూడా షేర్ చేసింది. ఆ ఫోటో షూట్ లో  యశ్ ఒడిలో కూర్చొని ఫోటోలకు ఫోజులు ఇవ్వడం గమనార్హం. ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. కాగా.. కొద్ది రోజుల క్రితం.. బర్త్ కేక్ తో కూడా నుస్రత్ హింట్ ఇచ్చేసింది. ఆ కేకు మీద  డాడీ, భర్త అంటూ.. పేర్కొనడం గమనార్హం. మొత్తానికి తన బిడ్డకు తండ్రి యశ్ గుప్తా అని ఆమె ప్రకటించడంతో చాలా వివాదాలకు పులిస్టాప్ పడింది.

కాగా.. ఆగస్టు 26న నుస్రత్ మగ బిడ్డకు జన్మనిచ్చింది.  ఆ బాబుకి ఇషాన్ జే దాస్ గుప్తా (Yishaan J Dasgupta) అని నామరణం చేశారు. ఈ ఏడాది జూన్ లో ఆమె.. తన మొదటి భర్తతో విడిపోయినట్లు ప్రకటించడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios