గే సెక్స్ నేరమా?: సుప్రీంపైకి నెట్టేసిన కేంద్రం

Is Gay Sex A Crime? Centre Says "Leave It To Wisdom Of Supreme Court"
Highlights

గే సెక్స్ పై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా చెప్పలేదు. దానిపై నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకే వదిలేసింది.

న్యూఢిల్లీ: గే సెక్స్ పై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా చెప్పలేదు. దానిపై నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకే వదిలేసింది. 377 ఆర్టికల్ పై నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకే వదిలేస్తున్నట్లు ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. గత 150 ఏళ్లుగా గే సెక్స్ పై నిషేధం ఉంది. 

ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 377 ఆర్టికల్ వేసిన పిటిషన్ పై విచారణను చేపట్టింది.  బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో రూపొందించిన ఆర్టికల్ 377 గే సెక్స్ ను నేరంగా పరిగణిస్తూ ఆ నేరానికి పాల్పడినవారికి జీవిత ఖైదు విధించడానికి అవకాశం కల్పిస్తుంది. 

గే సెక్స్ నేరమా కాదా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సిందే కోర్టేనని ప్రభుత్వ న్యాయవాది తుషార్ మెహతా చెప్పారు. దానికి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా స్పందిస్తూ - దాన్ని నేరంగా పరిగణించాలా, వద్దా అనే విషయాన్ని మాకే వదిలేస్తున్నారా అని అడిగారు.  

loader