టెక్కీ భార్యతో పోలీసాఫీసర్ రాసలీలలు: బయటపడిన వీడియో

IPS officer in an affair with techie's wife, video surfaces
Highlights

ఓ టెక్కీ భార్యతో యూనిఫాంలో ఓ పోలీసు అధికారి రాసలీలలు చేస్తున్న వీడియో వెలుగు చూసింది. ఆదివారంనాడు ఆ వీడియో బయటపడింది. ఈ సంఘటనపై టెక్కీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బెంగళూరు: ఓ టెక్కీ భార్యతో యూనిఫాంలో ఓ పోలీసు అధికారి రాసలీలలు చేస్తున్న వీడియో వెలుగు చూసింది. ఆదివారంనాడు ఆ వీడియో బయటపడింది. ఈ సంఘటనపై టెక్కీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ అధికారిపై చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరమంగళ పోలీసులు కోర్టును కోరే అవకాశం ఉంది. 

ఈ సంఘటనపై టెక్కీ భార్య తన వాదనతో ముందుకు వచ్చింది. తన భర్తతో తాను ఆనందంగా లేనని, కొద్ది నెలలుగా తాను విడిగా ఉంటున్నానని చెప్పింది. తన భర్తపై ఆమె కేసు దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

తన భార్యతో లైంగిక క్రీడ సాగిస్తూ పట్టుబడిన వీడియోను టెక్కీ పోలీసులకు సమర్పించారు. దేవెనగరెకు చెందిన టెక్కీ తాను పోలీసులకు గురువారంనాడు ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. అతను డిజి నీలమణి రాజును, ఇతర పోలీసు ఉన్నతాధికారులను కలిశాడు. అయితే, వారు తనను పట్టించుకోలేదని అతను ఆరోపిస్తున్నాడు. 

తమకు 2010 వివాహమైందని, భార్యతో పాటు తాను అమెరికా వెళ్లానని, రెండేళ్ల పాటు అక్కడ ఉండి తిరిగి వచ్చి దేవెనగిరేలో స్థిరపడినట్లు టెక్కీ చెప్పాడు. తన భార్య 2017లో గ్రాఫిక్ డిజైనింగ్ స్టూడియో పెట్టే క్రమంలో ఆ పోలీసాఫీసరును కలిసిందని, తన కవల కూతుళ్ల ఫొటో షూట్ కోసం ఆ పోలీసాఫీసరు స్టూడియోకు వచ్చాడని ఆయన చెప్పాడు.

తొలుత తనకు వారి మధ్య అఫైర్ గురించి తెలియదని, వారిద్దరు ఆఫీసులోనూ కాఫీ షాపులోనూ కలుస్తూ వచ్చారని, తనకు తెలిసిన తర్వాత పోలీసాఫీసరును కలవడం మానేయాలని తన భార్యకు చెప్పానని ఆయన తన ఫిర్యాదులో చెప్పాడు.

అయినా వారిద్దరు కలవడం మానేయలేదని, దేవెనగరేలో రిస్టార్ కూడా బుక్ చేసుకున్నారని, తన భార్య ఫోన్ లో ఆ అధికారి తన భార్యను ముద్దు పెట్టుకున్న వీడియో చూశానని, తాను పోలీసాఫీసరుతో గొడవ పడ్డానని, అతను తనను బెదిరించాడని టెక్కీ వివరించాడు.  

loader