హీరో అజిత్ సినిమా చూడటానికి డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తి... కన్నతండ్రి పట్ల దారుణంగా ప్రవర్తించాడు. కన్న తండ్రి అని కూడా చూడకుండా కొట్టి.. పెట్రోల్ పోసి తగలపెట్టాలని చూశాడు. ఈ దారుణ సంఘటన తమిళనాడులోని వేలూరులో  చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... వేలూరుకి చెందిన అజిత్ కుమార్ అనే యువకుడు... తమిళ హీరో అజిత్ కి వీరాభిమాని. అజిత్ సినిమా ఏది విడుదలైనా... తొలి రోజు తొలి షో చూడాల్సిందే. గురువారం అజిత్ నటించిన ‘‘విశ్వాసం’’ సినిమా విడుదల అవుతోంది. కాగా.. ఈ సినిమా మొదటి రోజు మొదటి షో చూడాలని ఆ యువకుడు భావించాడు.

సినిమా టికెట్ కి డబ్బులు ఇవ్వాల్సిందిగా తండ్రిని కోరాడు. ఇందుకు అతని తండ్రి అంగీకరించకపోడంతో... ఆగ్రహించిన అజిత్‌కుమార్‌ తండ్రిపై పెట్రోల్‌పోసి తగులబెట్టడానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలో అతని తండ్రి ముఖం సగ భాగం  కాలిపోయింది. ప్రస్తుతం  అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అజిత్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.